తెలంగాణ (Telangana) ఎంసెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ (హైదరాబాద్) నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయోలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి/ ఆప్షనల్, ఒకేషనల్ కోర్సుల ఉత్తీర్ణత / డిప్లమా చివరి సంవత్సరం చదువతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
Wipro Jobs: విప్రో హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూలై 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెంట్ దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
Ts Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. 13,000 పోస్టులతో ఆ శాఖలో నోటిఫికేషన్
ఎంసెట్‌లో వెయిటేజీ లేదు..
ఇంటర్ (Inter) విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇంటర్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ ఎంసెట్ 2022లో ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలు అని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్ వెయిటేజీకి సైతం ఎంసెట్ ర్యాంకులలో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సారి ఎంసెట్ ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కరోనా కారణంగా సరిగా చదవని విద్యార్థులకు ఊరట కలుగనుంది.
నిబంధనల్లో మార్పులు..
ఇప్పటి వరకు ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు మినిమం మార్కులతో ఇంటర్ పాస్ అయితే చాలు అని గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Telangana