Home /News /jobs /

TS EAMCET 2022 ALERT FOR JEE EAMCET 2022 STUDENTS CHANGES IN ADMISSION DATES EVK

TS EAMCET 2022: జేఈఈ, ఎంసెట్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. అడ్మిష‌న్ తేదీల్లో మార్పులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS EAMCET 2022 | తెలంగాణ ఐఐటీ, ఎంసెట్ విద్యార్థుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సాధార‌ణంగా ప్ర‌తీ ఏటా ఐఐటీ అడ్మిష‌న్‌లు పూర్త‌యిన త‌రువాత రాష్ట్రంలో ప్ర‌వేశాలు ప్రారంభం అవుతాయి. ఇందుకు కార‌ణాల‌ను ప్ర‌భుత్వం వెల్ల‌డించింది

ఇంకా చదవండి ...
    తెలంగాణ (Telangana) ఐఐటీ, ఎంసెట్ విద్యార్థుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సాధార‌ణంగా ప్ర‌తీ ఏటా ఐఐటీ అడ్మిష‌న్‌లు పూర్త‌యిన త‌రువాత రాష్ట్రంలో ప్ర‌వేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సారి అందుకు భిన్నంగా ప‌రిస్థితి ఉండ‌నుంది. ఐఐటీ ప్ర‌వేశాల‌కంటే ముందుగానే ఈ సారి ప్ర‌వేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొంది. ఈ మేరకు జూలై 14, 2022 నుంచి జూలై 20, 2022 వ‌ర‌కు రాష్ట్రంలో ఎంసెట్ నిర్వ‌హించ‌నున్నారు. దీనికి కార‌ణాల‌ను కూడా ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. జేఈఈ అడ్వాన్స్ (JEE Advanced) ప‌రీక్ష ఆల‌స్యం అవ్వ‌డంతో ప్ర‌భుత్వం తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకొన్నారు. దీని ద్వారా వ‌చ్చే స‌మ‌స్య‌ను అధికారులు గుర్తించారు.

    Jobs in AP: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 18,500.. వివ‌రాలు


    ముందుగానే కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల చాలా మంది విద్యార్థులు రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ కాలేజీలో చేరుతారు. త‌రువాత ఐఐటీ (IIT) ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం వారి ర్యాంకుల‌ను బ‌ట్టి ఐఐటీలో చేరే అవ‌కాశం ఉంది. దీని ద్వారా కాలేజీలో సీట్లు ఖాళీగా మిగిలిపోతాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీలు ఏర్పడిన సీట్ల భ‌ర్తీకి ఎంసెట్‌లో మ‌రో విడ‌త కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. జూలై 3, 2022న జ‌ర‌గాల్సిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష ఆగస్టు 28, 2022కు మార్చ‌డంతో ఈ స‌మ‌స్య ఏర్ప‌డింది.

    జేఈఈ ప‌రీక్ష తేదీల మార్పుపై ఐఐటీ బాంబే స్పందించింది. జేఈఈ మెయిన్ (JEE Main) ప‌రీక్ష తేదీల్లో జ‌రిగిన మార్పుల కార‌ణంగానే జేఈఈ అడ్వాన్స్‌లో మార్పులు చేసిన‌ట్టు తెలిపారు. ఐఐటీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి తెలంగాణ‌లో 14 ప‌రీక్ష కేంద్రాల‌ను ఎంపిక చేసిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

    AP Job Mela: ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. మూడు చోట్ల జాబ్ మేళా.. అప్లికేష‌న్ వివ‌రాలు

    జేఈఈ అడ్వాన్స్ తేదీల్లో మార్పుల వివరాలు..

    జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు సంబంధించి తేదీలను ఐఐటీ బాంబే (IIT Bombay) రీ షెడ్యూల్ చేసింది. వాస్తవానికి ఈ పరీక్ష జులై 3 వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. ఆగస్టు 28కి రీ షెడ్యూల్ చేశారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. పరీక్ష ఫీజును ఆగస్టు 12 వరకు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 28 వరకు ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చెల్లించుకోవచ్చు. జేఈఈ మెయిన్ తేదీలను మార్చడంతో జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలను సైతం మార్చాల్సి వచ్చిందని ఐఐటీ బాంబే వెల్లడించింది.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    ఈ నేపథ్యంలో కొత్త తేదీని తాజాగా విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్, జులైలో నిర్వహించున్నట్లు వెల్లడించింది. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30తో ముగుస్తుంది. మొదటి, రెండో విడతల్లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై 3న నిర్వహించాల్సి ఉన్న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, EDUCATION, Higher education, IIT, IIT Bombay

    తదుపరి వార్తలు