• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TS EAMCET 2021 TO JEE MAINS 2021 THESE ALL EXAMS POSTPONED DUE TO COVID 19 SECOND WAVE SS GH

Exams Postponed: కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డ ఎగ్జామ్స్ ఇవే...

Exams Postponed: కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డ ఎగ్జామ్స్ ఇవే...

Exams Postponed: కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డ ఎగ్జామ్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

Exams Postponed | కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు వాయిదా పడ్డ పరీక్షల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. చాలా రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు పంపించారు. దీని ప్రభావం ప్రవేశ పరీక్షలపై పడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్, ఈ ఏడాది రెండు విడతల్లో జరిగింది. మరో రెండు విడతల్లో దీన్ని నిర్వహించాల్సి ఉంది. మరోవైపు వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల అయ్యాయి. వీటి గురించి కూడా విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జరిగే జేఈఈ మెయిన్స్‌తో పాటు, ఇతర ఇంజనీరింగ్ పరీక్షల కొత్త షెడ్యూల్‌పై విద్యార్థులు దృష్టి పెట్టాలి.

జేఈఈ మెయిన్స్, 2021


జేఈఈ మెయిన్స్ ఏప్రిల్, మే ఎగ్జామ్ సెషన్లు వాయిదా పడ్డాయి. రీ షెడ్యూల్ చేసిన తేదీలను ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సూచించారు. జేఈఈ మెయిన్- 2021.. ఏప్రిల్, మే సెషన్ల రిజిస్ట్రేషన్ తేదీ, పరీక్ష తేదీలను త్వరలో jeemain.nta.nic.inలో పొందుపర్చనున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021


ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2021 జూలై 3న జరగాల్సి ఉంది. మెయిన్స్ ఫలితాల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష వాయిదా పడటంతో అడ్వాన్స్‌డ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IIT Jobs 2021: ఐఐటీ రూర్కీలో 139 జాబ్స్... రేపే చివరి తేదీ

బిట్‌శాట్ 2021


బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్) 2021 పరీక్షలను జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాల్సి ఉంది. బిట్‌శాట్ 2021 అడ్మిట్ కార్డు జూన్ 12న విడుదల అవుతుంది. మరిన్ని వివరాలను వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.

WBJEE 2021


WBJEE పరీక్షను పశ్చిమ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు జూలై 11న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టులలో జరుగుతుంది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. WBJEE 2021 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలలు, సంస్థల్లో మొత్తం 34,981 సీట్లను భర్తీ చేయనున్నారు.

LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా

IT Jobs: నిరుద్యోగులూ బీ రెడీ... ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో 65,000 ఉద్యోగాలు

OJEE 2021


ఒడిశా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే OJEE 2021 పరీక్ష.. జూన్ 17 నుంచి జూన్ 24 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరగాల్సి ఉంది. OJEE దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. విద్యార్థులు మే 15 వరకు ojee.nic.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా BTech, BE, BPharma, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ MBA కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

VITEE


వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన VITEEE-2021ను ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మే 28, 29, 31 తేదీల్లో రిమోట్ ప్రొక్టర్ మోడ్‌లో జరగనున్నాయి. పరీక్షను క్లియర్ చేసిన వారు వెల్లూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్, భోపాల్‌లోని VIT క్యాంపస్‌లలో బిటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. VITEEE దరఖాస్తు ప్రక్రియ ఇంకా ముగియలేదు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే20 వరకు ఉంది.

SRMJEE


SRM గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌లో అడ్మిషన్ల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. వివిధ బీటెక్ ప్రోగ్రామ్‌ల కోసం రెండు దశల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు మే 23, 24 తేదీల్లో జరగాల్సిన SRMJEEE ఫేజ్-1 పరీక్షను లేదా జూలై 25, 26 తేదీల్లో జరగనున్న ఫేజ్-2ను పరీక్షను ఎంచుకోవచ్చు. రిమోట్ ప్రొక్టర్డ్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. SRMJEEE ఫేజ్-1 పరీక్షల దరఖాస్తుకు చివరి తేదీ మే 15, ఫేజ్-2కు జూలై 20గా ఉంది.

TS EAMCET


తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2021 పరీక్షలకు చాలా సమయం ఉంది. అగ్రికల్చర్, మెడికల్ విభాగాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్ష జూలై 5, 6వ తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ పరీక్ష జూలై 7, జూలై 8, జూలై 9 తేదీల్లో జరగనుంది. దరఖాస్తు గడువు ముగిసిన తరువాత కూడా ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

UPJEE


ఉత్తర ప్రదేశ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- 2021 పరీక్షలను, ఆ రాష్ట్రానికి చెందిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జూన్ 15 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన జిల్లాల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఏప్రిల్ 30 నుంచి మే 15 వరకు పొడిగించారు.

COMEDK


కర్ణాటకలోని వివిధ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్‌, కర్ణాటక (COMEDK).. అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (UGET)-2021ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 100కు పైగా సంస్థల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష జూన్ 20న 150 నగరాల్లోని 400 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇంజనీరింగ్ అభ్యర్థులు మే 20లోపు సంబంధిత వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు