TS EAMCET 2020: Answer Key విడుదల...ఎలా చెక్ చేసుకోవాలంటే...

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష "కీ" నిర్వహక అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎంసెట్‌ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్‌ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: September 18, 2020, 9:11 PM IST
TS EAMCET 2020: Answer Key విడుదల...ఎలా చెక్ చేసుకోవాలంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష "కీ" నిర్వహక అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 9,10,11,14 తేదీల్లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్‌ నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 1 లక్ష 19వేల187 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. కాగా ఎంసెట్ పరీక్ష "కీ"ని https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని గోవర్ధన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఎంసెట్‌ ప్రాథమిక కీ తో పాటు విద్యార్థుల ఓఎంఆర్‌ పేపర్ స్కానింగ్‌ కాపీలనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎంసెట్‌ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్‌ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

కీలో అభ్యంతరాలుంటే వాటిని ఈ నెల 20 తేదీ సాయంత్రం 5 గంటల లోగా తెలియజేయాలని నిర్వాహకులు తెలిపారు.

TS EAMCET 2020 : కీ ఇలా చెక్ చేసుకోండి...

  • అభ్యర్థులు తప్పనిసరిగా eamcet.tsche.ac.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి

  • జవాబు కీ 2020 లింక్‌కి వెళ్లండి.

  • మీ అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత జవాబు కీని డౌన్‌లోడ్ చేయండి
  • అభ్యంతరాలను లేవనెత్తడానికి కాపీని సేవ్ చేయండి లోపాలను గుర్తించండి.

Published by: Krishna Adithya
First published: September 18, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading