TS Eamcet 2019 Results: కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా

TS Eamcet 2019 Results | విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఫలితాలను ఆదివారం ప్రకటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఎంసెట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: June 9, 2019, 9:53 AM IST
TS Eamcet 2019 Results: కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా
TS Eamcet 2019 Results: కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా
news18-telugu
Updated: June 9, 2019, 9:53 AM IST
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ టి.పాపి రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ఏ.వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ ఎంసెట్ 2019 కన్వీనర్ ఎన్.యాదయ్య కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు నాలుగు రోజుల క్రితమే విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు జాప్యం కావడం విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. గతేడాది మే 19న ఎంసెట్ ఫలితాలు విడుదలైనా... ఈసారి జూన్ మొదటివారం గడిచినా ఫలితాలపై స్పష్టత లేదన్న ఆందోళన కనిపించింది. విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఫలితాలను ఆదివారం ప్రకటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఎంసెట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షకు మొత్తం 175,811‬ మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3 నుంచి మే 9 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

TS Eamcet 2019 Results: టీఎస్ ఎంసెట్ 2019 ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా


ముందుగా https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో TS Eamcet 2019 Results ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఎంసెట్ ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి
First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...