TS Eamcet Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మరింత ఆలస్యం... కారణం ఇదే

TS Eamcet 2019 Results | ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం ఎంసెట్‌లో వెయిటేజీ ఉంటుంది కాబట్టి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలంటే ఇంటర్ మార్కుల్ని జేఎన్టీయూకు ఇంటర్ బోర్డు ఇవ్వాలి.

news18-telugu
Updated: June 7, 2019, 12:43 PM IST
TS Eamcet Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మరింత ఆలస్యం... కారణం ఇదే
TS Eamcet Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మరింత ఆలస్యం... కారణం ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 7, 2019, 12:43 PM IST
మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు ఎప్పుడు అన్న స్పష్టత లేదు. వాస్తవానికి 2018లో మే 19న ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు జూన్ మొదటి వారం దాటినా తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ఫలితాలు ఒకేసారి విడుదలౌతాయని మొదట వార్తలొచ్చినా... ఏపీలో రిజల్ట్ వచ్చాయి కానీ, తెలంగాణలో ఫలితాల కోసం విద్యార్థులకు ఎదురుచూపులే మిగిలాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు జాప్యం కావడానికి కారణం ఇంటర్ బోర్డే అని తెలుస్తోంది. తెలంగాణలో ఎంసెట్ నిర్వహించిన జేఎన్‌టీయూకు ఇంటర్ బోర్డు నుంచి ఇంకా మార్కుల డేటా వెళ్లలేదు. దీంతో ఎంసెట్ ఫలితాలపై జేఎన్‌టీయూ-హైదరాబాద్ ముందడుగు వేయలేకపోతోంది. ఇంటర్ ఫలితాలు వివాదాస్పదం కావడం, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రాసెస్‌లోనూ లోపాలు బయటపడటంతో మార్కుల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఇంటర్ బోర్డు తుది మార్కుల్ని జేఎన్టీయూకు పంపలేదని తెలుస్తోంది.

ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం ఎంసెట్‌లో వెయిటేజీ ఉంటుంది కాబట్టి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలంటే ఇంటర్ మార్కుల్ని జేఎన్టీయూకు ఇంటర్ బోర్డు ఇవ్వాలి. ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల్ని జేఎన్టీయూకు పంపిన తర్వాత ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన మరో 10 రోజుల వరకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎంసెట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షకు మొత్తం 175,811‬ మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3 నుంచి మే 9 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి. మే 10న ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ విడుదల చేయగా, మే 13 వరకు అభ్యంతరాల్ని స్వీకరించింది జేఎన్టీయూ.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి
First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...