TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS EAMCET 2019 | తెలంగాణ ఎంసెట్ పరీక్షకు మొత్తం 1,75,811‬ మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3 నుంచి మే 9 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

news18-telugu
Updated: June 9, 2019, 12:22 PM IST
TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
TS Eamcet 2019 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా
news18-telugu
Updated: June 9, 2019, 12:22 PM IST
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ టి.పాపి రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ఏ.వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ ఎంసెట్ 2019 కన్వీనర్ ఎన్.యాదయ్య కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఎంసెట్ పరీక్షల్లో లక్షా 30 వేల మంది ఇంజనీరింగ్ పరీక్షలు రాయగా... 68వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ  ఎగ్జామ్స్ అటెండ్ చేశారు. ఈ రిజల్ట్స్‌లో ఇంజినీరింగ్‌లో కే.రవిశ్రీతేజ మొదటిర్యాంక్ సాధించగా..డి.చంద్రశేఖర్ రెండో ర్యాంక్ సాధించాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు నాలుగు రోజుల క్రితమే విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు జాప్యం కావడం విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. గతేడాది మే 19న ఎంసెట్ ఫలితాలు విడుదలైనా... ఈసారి జూన్ మొదటివారం గడిచినా ఫలితాలపై స్పష్టత లేదన్న ఆందోళన కనిపించింది. విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఫలితాలను ఆదివారం ప్రకటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.తెలంగాణ ఎంసెట్ పరీక్షకు మొత్తం 1,75,811‬ మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3 నుంచి మే 9 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

 

TS Eamcet 2019 Results: టీఎస్ ఎంసెట్ 2019 ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా




* ముందుగా https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
* హోమ్ పేజీలో TS Eamcet 2019 Results ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
* హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
Loading...
* ఎంసెట్ ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...