Home /News /jobs /

TS DOST 2022 NOTIFICATION TELANGANA DEGREE ADMISSION NOTIFICATION REALESED REGISTER AT DOST CGG GOV IN VB

DOST Notification 2022: దోస్త్(DOST) నోటిఫికేషన్ విడుదల.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

DOST Notification 2022: తెంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అవ్వడంతో పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలిలా..

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana) ఇంటర్ ఫలితాలు(Inter Results) విడుదల అవ్వడంతో ఉత్తీర్ణత సాధించిన  విద్యార్థులు డిగ్రీలో(Degree) చేరేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌(Hyderabad) మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలిలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి దోస్త్ (DOST) నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు(Registrations) చేసుకునేందుకు జూలై 1 నుంచి 30 వరకు అవకాశం ఇవ్వగా.. దీనికి జూలై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను(Web Options) నమోదు చేసుకోవచ్చు.  ఆగస్టు 6న సీట్లు కేటాయించనున్నారు.  ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు(Students) రిపోర్టింగ్(Reporting) చేయాల్సి ఉంటుంది. రెండో విడత ఆగస్టు 7 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి ఆగస్టు 22న సీట్లు కేటాయించనున్నారు.  మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు అవకాశం ఇచ్చారు.  వీటికి సీట్లను సెప్టెంబర్ 16న కేటాయించనునట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి క్లాస్ లు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి: జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా(Osmania), కాకతీయ,శాతవాహన(Satavahana), పాలమూరు(Palamuru) యూనివర్సిటీల
పరిధిలోని 1060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ అలాట్ మెంట్ అనేది మూడు  విడతల్లో జరగనుంది. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది.



రిజిస్ట్రేషన్ కొరకు విద్యార్థులు మొదటగా https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెబ్ సైట్ హోం పేజీలో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్‌పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన అనంతరం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ సమర్పించాల్సి ఉంటుంది. పైన చెప్పిన వెబ్ సైట్ కాకుండా టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.



ఇంటర్ మెమోలను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మంగళవారం ఉదయం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఆన్‌లైన్‌లో మార్క్స్ మెమోలను జారీ చేస్తోంది. కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పాటు విద్యార్థులు మార్క్స్ మెమోలు డౌన్‌లోడ్ చేయొచ్చు. 2022 జూన్ 28 సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో (TS Inter Short Memo) డౌన్‌లోడ్ చేయొచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించినట్టుగానే అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఈజీ స్టెప్స్‌తో మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో TSBIE IPE 2022 Mark's Memos పైన క్లిక్ చేయాలి. రిజల్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్, జనరల్, వొకేషనల్, జనరల్ బ్రిడ్జి కోర్స్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులో విద్యార్థులు తమకు చెందిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. Get Memo పైన క్లిక్ చేయాలి. స్క్రీన్‌పైన షార్ట్ మెమో కనిపిస్తుంది. ప్రింట్ తీసుకొని పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేయాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు