హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Constable Exam Rules: గోరింటాకు వద్దు.. ఒక్క నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు రూల్స్ ఇవే

TS Constable Exam Rules: గోరింటాకు వద్దు.. ఒక్క నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు రూల్స్ ఇవే

మాట్లాడుతున్న ఎస్పీ

మాట్లాడుతున్న ఎస్పీ

ఈ నెల 28న తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India


  ఆగస్టు 28 ఆదివారం నాడు నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలని నల్లగొండ ఎస్పీ (Nalgonda SP) రెమా రాజేశ్వరి ఐ.పి.యస్ అధికారులకు సూచించారు. పరీక్ష నేపథ్యంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు (Exams) పగడ్భందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాత పరీక్షకు (Written Exam) హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరన్నారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని అన్నారు.


  పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, పరీక్ష హాలు లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు, మేహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహందీ, వంటివి పెట్టుకోరాదని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరనీ,సెల్ ఫోన్లు, వాచ్ లు(చేతి గడియారాలు) ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని తెలిపారు.
  Telangana Constable Jobs Tips: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ టిప్స్ తెలుసుకోండి
  పరీక్షకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయబడతాయని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని ,ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. బయోమెట్రిక్ ఉపయోగించి పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఒకటికి రెండుసార్లు పరీక్ష కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులు చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, మరియు ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు.  ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి ఓ.యస్.డి ఆశ్వాక్ డి. యస్.పి లు నరసింహ రెడ్డి,వెంకట రమణ,సురేష్ కుమార్ మరియు చీప్ సూపర్ండెంట్లు, బి.నాగరాజు, కే.చంద్ర శేఖర్ అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఇన్స్పెక్టర్లు సత్యం, చంద్రశేఖర్ రెడ్డి,గోపి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కృష్ణా రావు,శ్రీను ఐటీ సెల్ ఎస్ఐ నాగరాజు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Nalgonda, Police jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు