తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ పూర్తయింది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును మే 26, 2022 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో ఈ 16,027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును మే 26, 2022 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
Step 11 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ మెజరమెంట్స్
- పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
- లాంగ్ జంప్ ఈవెంట్లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.