TS CONSTABLE APPLICATION INITIATION OF APPLICATIONS FOR 16027 CONSTABLE POSTS STEP BY STEP APPLICATION PROCEDURE EVK
TS Constable Application: 16,027 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. స్టెప్ బై స్టెప్ అప్లికేష్ విధానం
ప్రతీకాత్మక చిత్రం
TS Constable Jobs | తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలా తెలుసుకోండి.
తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో 16,027 కానిస్టేబుల్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభమైజ.. 2022 మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం..
Step 1 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి.
Step 2 - కుడి వైపు పైన Apply Online ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
Step 3 - Have you already Registered ? అని కనిపిస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకొనే వారు NO క్లిక్ చేయాలి.
జిల్లాల వారీగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల వివరాలు..
జిల్లా
ఖాళీలు
ఆసిఫాబాద్-కొమురం భీం
182
భూపాలపల్లి-జయశంకర్
64
ములుగు
68
రామగుండం పోలీస్ కమిషనరేట్
441
ఆదిలాబాద్
234
జగిత్యాల
123
నిర్మల్
158
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
400
కామారెడ్డి
240
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్
413
మెదక్
179
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్
222
కొత్తగూడెం-భద్రాద్రి
142
మహబూబాబాద్
190
వరంగల్ పోలీస్ కమిషనరేట్
850
నల్గొండ
464
రాచకొండ పోలీస్ కమిషనరేట్
850
సూర్యాపేట
320
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్
451
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్
1,918
సంగారెడ్డి
545
వికారాబాద్
107
గద్వాల్ - జోగులాంబ
118
మహబూబ్‌నగర్
201
నాగర్ కర్నూల్
195
నారాయణపేట
100
వనపర్తి
131
కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ మెజరమెంట్స్
- పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.