TS BC STUDY CIRCLE OFFERS FREE COACHING TO IBPS JOBS ASPIRANTS HERE DETAILS NS
Free Coaching for IBPS: ఐబీపీఎస్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. ఆన్లైన్లో బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీకోచింగ్
ప్రతీకాత్మక చిత్రం
ఐబీపీఎస్ ఉద్యోగాలకు (Bank Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle) శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
భారీగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీగా బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు అత్యధికంగా యువత పోటీ పడుతూ ఉంటారు. ఇందుకోసం వేలకు వేలు చెల్లించి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సామాన్యులకు ఈ మొత్తంలో ఫీజు చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle) శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బ్యాంక్ కోచింగ్ కు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించారు. జిల్లాకు 30 మంది చొప్పున మొత్తం వేయి మందికి ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.
అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.. Step 1:అభ్యర్థులు మొదటగా బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. Step 2:అనంతరం FREE COACHING PROGRAMME TO IBPS 2022-23 కనిపిస్తుంది. ఆ లింక్ కింద కనిపించే Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 3:కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, ఫాదర్ పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, కులం, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. Step 4:ఇంకా అభ్యర్థుల ఫొటో, సిగ్నేచర్, టెన్త్ మొమో, డిగ్రీ మెమో, కులం, ఆదాయం, నేటివిటీ, ఆధార్ కార్డ్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం Submit ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.