హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS BC Study Circle Civils Coaching: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్

TS BC Study Circle Civils Coaching: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TS BC Study Circle) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TS BC Study Circle) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. సివిల్ సర్వీసెస్ కు (Civil Service) ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కోచింగ్ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది బీసీ స్టడీ సర్కిల్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ (Application Process) ఈ నెల 8వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫలితాలను 27వ తేదీన విడుదల చేస్తారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 200 మంది అభ్యర్థులకు ఓయూ సెంటర్, హైదరాబాద్, మరో 100 మంది విద్యార్థులకు హన్మకొండలో శిక్షణ ఉంటుంది.

  గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి.. గ్రూప్-1 పరీక్షకు హాజరైన లేదా 75 శాతం మార్కులతో పీజీ చేసిన వారికి 50 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా 50 శాతం సీట్లను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేలను లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కోసం అందిస్తారు. మరో 5 వేల రూపాయల విలువైన పుస్తకాలను అందిస్తారు.

  Telangana Jobs: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో మరో 529 పోస్టులు మంజూరు..

  ఇతర అర్హతలు:

  - అభ్యర్థుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

  - అభ్యర్థులు ఎక్కడ పని చేస్తూ ఉండకూడదు. లేదా ప్రస్తుతం ఏదైనా కోర్సును అభ్యసిస్తున్న వారు సైతం దకఖాస్తుకు అనర్హులు.

  - అభ్యర్థులు ఇప్పటివరకు తెలంగాణ స్టడీ సర్కిల్స్ లో శిక్షణ పొంది ఉండకూడదు.

  - అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

  - ఇతర వివరాలను ప్రకటనలో చూడొచ్చు.

  ఎలా దరఖాస్తు చేయాలంటే..

  Step 1: అభ్యర్థులు మొదటగా బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 3: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కావాల్సిన వివరాలను నమోదు చేయాలి.

  Step 4: టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఫొటో, సిగ్నేచర్ తో పాటు సూచించిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

  Step 5: అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Central Government Jobs, Civil Services, JOBS, Telangana government jobs, UPSC

  ఉత్తమ కథలు