హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS GROUPS, Teacher Jobs Free Coaching: తెలంగాణ గ్రూప్స్, టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త.. ప్రభుత్వ స్టడీ సర్కిల్ లో ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి

TS GROUPS, Teacher Jobs Free Coaching: తెలంగాణ గ్రూప్స్, టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త.. ప్రభుత్వ స్టడీ సర్కిల్ లో ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో గ్రూప్ 3, 4 తో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి శుభవార్త చెప్పింది బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle). ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో భారీగా ఉద్యోగాల (Telangana Government Jobs) భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఎలక్ట్రిసిటీ విభాగంలోనూ పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. త్వరలోనే గ్రూప్-4, 3 తో పాటు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు లక్షల మంది నిరుద్యోగులకు ప్రిపేర్ అవుతున్నారు. వారికి శుభవార్త చెప్పింది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle). గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, గురుకుల టీచర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఆఫ్ లైన్ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. వారికి 90 రోజుల పాటు ఆఫ్ లైన్ కోచింగ్ అందించనున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్లో (https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


  దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
  - అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ విద్యార్హతను కలిగి ఉండాలి.

  - అభ్యర్థులు గరిష్ట ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

  - అభ్యర్థులు దరఖాస్తు చేుసకునే సమయంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతో పాటు ఆధార్ కార్డును అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

  - ప్రస్తుతం రెగ్యులర్ విధానంలో ఏదైనా కోర్సును చేస్తున్నవారు, ఉద్యోగం చేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

  - గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్స్ లో శిక్షణ పొందిన వారు దరఖాస్తుకు అనర్హులు.

  - గతంలో బీసీ స్టడీ సర్కిల్స్ కు నేరుగా దరఖాస్తు పంపిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

  Job Mela In Hyderabad: హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 7 వేల జాబ్స్ .. ఇలా రిజిస్టర్ చేసుకోండి  ముఖ్యమైన తేదీలు:

  - ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 12

  - రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ: ఆగస్టు 25

  - ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 27

  - కోచింగ్ ప్రారంభం: సెప్టెంబర్ 1

  - హెల్ప్ లైన్ నంబర్: 040-24071178


  ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  Step 1: అభ్యర్థులు మొదటగా బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ (https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do) ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం హోం పేజీలో Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  కావాల్సిన వివరాలను నమోదు చేయాలి. సూచించిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

  Step 3: అనంతరం వివరాలను మరోసారి సరి చూసుకుని సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, State Government Jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు