తెలంగాణ, ఏపీలో ఇప్పటికే టెన్త్ ఫలితాలను (Tenth Results) ఆయా ప్రభుత్వాలు విడుదల చేశాయి. దీంతో ఆయా విద్యార్థులు (Students) పై చదువుల కోసం సిద్ధమవుతున్నారు. ఏ కోర్సుల్లో చేరాలన్న ఆలోచనలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో టెన్త్ తర్వాత విద్యార్థులు చేయడానికి అవకాశం ఉన్న కోర్సులకు (Courses) సంబంధించిన వివరాలను న్యూస్18 మీకు అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Intermediate: టెన్త్ తర్వాత సాధారణంగా ఎక్కువ మంది రెండేళ్ల ఇంటర్ కోర్సు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇంటర్ కు సంబంధించి మూడు రకాల గ్రూపులు ఉంటాయి. అందులో సైన్స్, కామర్స్, ఆర్ట్స్. సైన్స్ కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ కోర్సులను అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటారు. మాథ్స్ పై పట్టు ఎక్కువగా ఉన్నవారు లేదా.. ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న వారు సాధారణంగా ఎంపీసీని ఎంచుకుంటారు. బయోలజీపై ఆసక్తి ఉన్న వారు డాక్టర్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు బైపీసీని ఎంచుకుంటారు. ఇంకా కామార్స్ పై ఆసక్తి ఉన్న వారు సీఈసీ గ్రూప్ తీసుకుంటారు. ఇంకా ఆర్ట్స్ కు సంబంధించి ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులను కూడా టెన్త్ తర్వాత ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎంచుకోవచ్చు.
New Course: డిజిటల్ హెల్త్ రంగంలో కెరీర్ ఎంచుకోవాలంటే.. బెస్ట్ ఆన్‌లైన్ కోర్సు.. అర్హత, ఫీజు వివరాలు!
పాలిటెక్నిక్ (Polytechnic): ఇంటర్ తర్వాత అత్యధికంగా టెన్త్ అర్హత కలిగిన విద్యార్థులు ఎంచుకునే కోర్సు పాలిటెక్నిక్. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఈ కోర్సులో ఇంజనీరింగ్ మాదిరిగా మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఈఈఈ, ఐటీ, అగ్రికల్చర్, ఆక్కిటెక్చర్, ఈసీఈ లాంటి గ్రూపులను ఎంచుకుంటారు. పాలిటెక్నిక్ చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. పాలిటెక్నిక్ అర్హతతో ఉద్యోగాలు కూడా ఉంటాయి.
ఐటీఐ(ITI): టెన్త్ అర్హతతో విద్యార్థులు చేరగలిగే మరో కోర్సు ఐటీఐ. ఇందులో ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్ తదితర కోర్సులు ఉంటాయి. ఐటీఐ అర్హతతో సైతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి.
పారామెడిక్(Paramedical): టెన్త్ తర్వాత విద్యార్థులకు పారామెడికల్ కోర్సులు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ మూడేళ్ల ఉండే ఈ కోర్సులో DLMT, DHFM, DOA, DOT, హెల్త్ ఇన్ స్పెక్టర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ కోర్సులు ఉంటాయి.
షార్ట్ టర్మ్ కోర్సులు: (6 Months/1 Year): ఇంకా DTP, PGDCA, Tally, Internet, Graphics, Animation, Web Designing, Cyber Security లాంటి ఆరు నెలలు/ఏడాది పూర్తి చేసే కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, Career and Courses, JOBS, New courses