TS POLYCET 2020 Results: పాలీసెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే

TS 2020 POLYCET Results | తెలంగాణ పాలీసెట్ ఫలితాలు వచ్చేశాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 10, 2020, 12:37 PM IST
TS POLYCET 2020 Results: పాలీసెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే
TS POLYCET 2020 Results: పాలీసెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ పాలీసెట్ ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్-TS BTET. అభ్యర్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2న పాలీసెట్ పరీక్ష జరిగింది. వాస్తవానికి పరీక్ష గతంలోనే జరగాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. 56 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. పరీక్ష నిర్వహించిన 8 రోజుల్లోనే రిజల్ట్స్ విడుదల కావడం విశేషం. తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అంశాల్లో డిప్లొమా కోర్సులు చేయొచ్చు. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

విద్యార్థులు ముందుగా https://polycetts.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో POLYCET Results ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి View Rank Card పైన క్లిక్ చేయాలి.
ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
రిజల్ట్స్‌ని ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

తెలంగాణ పాలీసెట్ ఫలితాలు వచ్చేశాయి కాబట్టి త్వరలోనే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: September 10, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading