హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS SSC Results 2022: ఈ రోజే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్.. న్యూస్18 వెబ్‌సైట్‌లోనూ నేరుగా ఫలితాలు

TS SSC Results 2022: ఈ రోజే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్.. న్యూస్18 వెబ్‌సైట్‌లోనూ నేరుగా ఫలితాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ టెన్త్ ఫలితాలను (Telangana Tenth Results) ఈ రోజు విడుదల చేయనున్నారు అధికారులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను (TS Tenth Results) అధికారులు ఈ రోజు విడుదల చేయనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. మంత్రి ఫలితాలను విడుదల చేసిన అనంతరం విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో గత రేండేళ్లుగా రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సారి వైరస్ ప్రభావం తగ్గడంతో పరీక్షలను నిర్వహించారు.

అయితే.. స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమవడం.. పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు దాదాపు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. అయితే.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ నిర్వహించారు అధికారులు. సిలబస్ ను సైతం 30 శాతానికి తగ్గించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ఇప్పటికే ఏపీలో టెన్త్ ఫలితాలను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే కేవలం 67 శాతం మాత్రమే పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంమంటూ మండిపడ్డాయి. అయితే.. కరోనా పరిస్థితుల కారణంగానే పాస్ పర్సంటేజ్ నమోదైందని అధికార పార్టీ చెబుతోంది.

News18 Telugu వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవడం ఇలా..

Step 1: ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2: హోమ్ పేజీలో తెలంగాణ టెన్త్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.

Step 3: హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

Step 4: స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

Step 5: రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.


బోర్డ్ వెబ్ సైట్లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

Step 1: ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు మొదటగా  అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో టెన్త్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

First published:

Tags: JOBS, SSC results, Telangana SSC board exams, Telangana ssc results, TS 10th Exams 2022

ఉత్తమ కథలు