Home /News /jobs /

TS 10TH RESULTS 2022 TELANGANA SSC RESULTS RELEASED HERE IS THE DIRECT LINKS TO CHECK YOUR RESULTS NS

TS SSC Results 2022: కాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ టెన్త్ ఫలితాలు మరి కొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. విద్యార్థులు ఈ లింక్స్ తో తమ రిజల్ట్స్ ను డైరెక్టుగా చెక్ చేసుకోవచ్చు.

    దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు (TS Tenth Results) మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు దాదాపు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. అయితే.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ నిర్వహించారు అధికారులు. సిలబస్ ను సైతం 30 శాతానికి తగ్గించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

    News18 Telugu వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవడం ఇలా..

    Step 1: ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

    Step 2: హోమ్ పేజీలో తెలంగాణ టెన్త్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.

    Step 3: హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

    Step 4: స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

    Step 5: రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.

    బోర్డ్ వెబ్ సైట్లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

    Step 1: అభ్యర్థులు మొదటగా  అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం హోం పేజీలో టెన్త్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

    Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Sabita indra reddy, SSC results, Telangana ssc results

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు