TS 10TH RESULTS 2022 LIVE TELANGANA BOARD OF SECONDARY EDUCATION RELEASED 10TH SUPPLEMENTARY EXAMS SCHEDULE KNOW EXAM DATES HERE SS
TS 10th Results 2022: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
TS 10th Results 2022: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)
TS 10th Results 2022 | తెలంగాణలో ఎస్ఎస్‌సీ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఆగస్ట్ 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు (TS 10th Supplementary Exams) జరగనున్నాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.
తెలంగాణలో టెన్త్ పరీక్షా ఫలితాలు (TS 10th Results 2022) విడుదలయ్యాయి. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 5,09,307 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటే వారిలో 5,04,398 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. వారిలో 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫలితాలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆగస్ట్ 1 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 2022 జూలై 18 లోగా ఎస్ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించవచ్చు.
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే...
ఆగస్ట్ 1- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఏ... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 1- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 1- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 2- సెకండ్ లాంగ్వేజ్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 3- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 4- మ్యాథమెటిక్స్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 5- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 6- సోషల్ స్టడీస్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 8- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
ఆగస్ట్ 10- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.