తెలంగాణలోని ఇప్పటికే కాలేజీలు(Colleges), పాఠశాలు(Schools) ప్రారంభం అయ్యాయి. నేడు (జూన్ 28)తెలంగాణ ఇంటర్ ఫలితాలు(Inter Results) విడుదలయ్యాయి. ఇక పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. అయితే పది ఫలితాల(Tenth Results)విడుదలకు విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టత వచ్చింది. పది పరీక్షా(Exam) ఫలితాలను జూన్ 30 లేదా జూలై 1న విడుదల(Release) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి(Tenth Class) వార్షిక పరీక్షలు గత నెల 23 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో జూన్ 30 లేదా జూలై 1న టెన్త్ ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
AP EAMCET 2022 Tips: ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఈ టిప్స్ పాటించండి
అయితే ఈ సారి కూడా పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి రాష్ట్రంలో గ్రేడింగ్ విధానాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందు కు ఈ గ్రేడింగ్ విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. అయితే ఏపీలో గ్రేడింగ్ విధానాన్ని తీసేసి మార్కుల ద్వారా ఫలితాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణలో ఈసారి ఫలితాలు ఎలా ప్రకటిస్తారనే దానిపై చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ పదో తరగతి పరీక్షలు మే 23న ప్రారంభమై జూన్ 1న ముగిశాయి. మొత్తం 5,08,143 మంది విద్యార్థుల్లో దాదాపు 5.03 లక్షలకు పైగా విద్యార్థులు పది పరీక్షలు రాశారు.
ఇంటర్ పరీక్ష ఫలితాల విషయానికి వస్తే.. ఇంటర్ పరీక్షలు నేడు (జూన్ 28)న ఉదయం 11 విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఒకే క్లిక్‌లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లతో పాటు News18 Telugu వెబ్‌సైట్ https://telugu.news18.com/ లో కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఫలితాల్లో ఫస్టియర్ విద్యార్థులు 63.38 శాతం, సెకండ్ ఇయర్ లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు చివరి నాటికి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు మంత్రి సబిత తెలిపారు. ఈ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానం సంపాదించగా.. హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక జూలై 11 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Telangana 10th, Tenth class, Tenth results