Home /News /jobs /

TS 10TH PHYSICS DO YOU WANT TO SCORE WELL IN ADVANCED PHYSICS FOLLOW THESE TIPS EVK

TS 10th Physics: ప‌దోత‌ర‌గ‌తి ఫిజిక్స్‌లో మంచి స్కోర్ చేయాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS 10th Physics | ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు మే 27, 2022న జ‌రిగే ఫిజిక్స్ మంచి స్కోర్ సాధించేందుకు టిప్స్ ఫాలో అవ్వండి.

    కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అనేక బోర్డు పరీక్షలను ఆయా ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పరీక్షల తేదీలను సైతం విడుదల చేశారు అధికారులు. అయితే.. ఈ ఏడాది కూడా కొన్ని రోజుల పాటు ఆన్లైన్ విధానంలోనే విద్యా బోధన జరిగింది. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం, విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉండడంతో సిలబస్ ను కొంత మేర తగ్గించారు. దీంతో ప్రశ్నాపత్రాల కూర్పు కూడా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఇందులో భాగంగా సూర్యాపేట జిలా ఉర్లుగొండ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు అచ్చ స్వప్న అందించిన ఫిజిక్స్ మంచి స్కోర్ సాధించేందుకు టిప్స్ వివరించారు. 

    JNTUH: ప్ర‌తీ కళాశాల‌లో ఇక‌పై స్కిల్ కోర్సులు.. సెల‌బ‌స్ విధానంలో మార్పులు.. జెన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

    మొత్తం పార్ట్ ఏ, పార్టీ బీగా పేపర్ విభజింపబడుతుంది. పార్ట్ ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి.
    -మొదటి సెక్షన్లో 6 ప్రశ్నలు ఉంటాయి. అందుటో మూడు రాయాలి. ఒక్కో ప్రశ్నలకు రెండు మార్కులు మొత్తం 3*2=6మార్కులు.
    -సెక్షన్ 2 లో 4 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 2*4=8 మార్కులు.
    -సెక్షన్-3లో 4 ప్రశ్నలు ఉంటాయి. రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. మొత్తం 2*8=16. మార్కులు.
    పార్ట్ బీలో..
    -పార్ట్ బీలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. 10*1=10.

    Jobs in Air India: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

    మంచి మార్కుల కోసం టిప్స్..
    -బేధాలు అడిగినప్పుడు పట్టిక రూపంలో రాస్తే బాగుంటుంది.

    JioPhone Next: వినియోగ‌దారుల‌కు రిల‌య‌న్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.4,499తో సరికొత్తజియో ఫోన్ నెక్ట్స్‌ 

    -కిరణరేఖా చిత్రాలను ప్రతిబంబ లక్షణాలను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి.
    -ఈ సారి సిలబస్ లో 30 శాతం సిలబస్ ను తొలగించారు. మానవుని కన్ను రంగుల ప్రపంచం పాఠ్యంశంలో కాంతి పరిక్షేపణం, రసాయనబంధం, విద్యుదయస్కాంతం, కార్బన్ దాని సమ్మేళనాలు తొలగించారు. విద్యార్థులు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి.
    -ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, విద్యుత్ ప్రవాహం, గోళాకర దర్పణాలతో కాంతి -పరివర్తనం పాఠ్యాంశాలతో పట్టికలను బాగా అవగతం చేసుకోవాలి.
    -ఫార్ములాలు, ప్రమాణాలను బాగా నేర్చుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th Class Exams, Career and Courses, EDUCATION, Telangana 10th

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు