హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ ఎగ్జామ్ పేపర్ ఇలా.. ఓ లుక్కేయండి

TS 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ ఎగ్జామ్ పేపర్ ఇలా.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సిలబస్ తగ్గించింది తెలంగాణ సర్కార్. అందులో భాగంగా పదో తరగతి సామాన్య శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి గతంలో రెండు పేపర్లు ఉండగా.. ఈ సారి ఒకే ప్రశ్నపత్రం పెట్టి పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇంకా చదవండి ...

సేకరణ: సయ్యద్ రఫీ, న్యూస్18 కరస్పాండెంట్, మహబూబ్ నగర్

రచయిత: జరీనా బేగం, ఉపాధ్యాయురాలు, TSWRS, దామరగిద్దా, నారాయణపేట మండలం

గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు (Tenth Exams) నిర్వహించకుండానే పాస్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ సారి ఎలాగైనా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సిలబస్ తగ్గించింది. అందులో భాగంగా పదో తరగతి సామాన్య శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి గతంలో రెండు పేపర్లు ఉండగా.. ఈ సారి ఒకే ప్రశ్నపత్రం పెట్టి పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి సామాన్య శాస్త్రం మోడల్ పేపర్(Model Papers) ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

పదవ తరగతి సామాన్య శాస్త్రం ఎగ్జామ్ ను భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం రెండు పేపర్లుగా విభజించారు. భౌతిక రసాయన శాస్త్రం 40 మార్కులు కాగా సమయం 01:35 గంటలు. జీవశాస్త్రం 40 మార్కులు కాగా సమయం 1:35.గంటలు. ఈ విద్యా సంవత్సరంలో సామాన్య శాస్త్రం ఎగ్జామ్ ఒకటే రోజు నిర్వహిస్తారు. భౌతిక రసాయన శాస్త్రం 40 మార్కులు సమయం 01:35 గంటలు. జీవశాస్త్రం 40 మార్కులు సమయం 01:35 గంటలు. ఈ ఎగ్జామ్స్ లో పార్ట్ ఏ లోని సెక్షన్-1లో మొత్తం ఆరు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి మూడు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం మూడు ప్రశ్నలకు ఆరు మార్కులు. 3×2=6.మార్కులు. సెక్షన్ టూ లో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.

Tenth English paper: 10వ తరగతి ఇంగ్లీష్​ పేపర్​ ఎలా ఉండబోతుంది.. సమాధానాలు రాసే విధానం గురించి నిపుణుల సూచనలు మీ కోసం..

ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు రెండు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు. 2×4=8 మార్కులు కేటాయించనున్నారు. సెక్షన్ మూడు లో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఎనిమిది మార్కుల చొప్పున మొత్తం 16 మార్కులు..2×8=16.మార్కులు. పార్ట్ బి..మొత్తం మార్కులు 10..పార్ట్ బిలో మొత్తం పది ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 10 మార్కులు కేటాయించారు. 10×1=10 మార్కులు. భౌతిక రసాయన శాస్త్రం.. పార్ట్ ఏ.సెక్షన్ ఒక్కటి లో ఈ విధంగా ఉంటుంది..  3×2=6..సెక్షన్- 2లో 2×4=8..సెక్షన్-3 లో 2×8=16.పార్టు బి లో...10×1=10... ఈ విధంగా భౌతిక రసాయన జీవ శాస్త్రం పరీక్ష పత్రం ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Exams, TS 10th Exams 2022

ఉత్తమ కథలు