Home /News /jobs /

TS 10TH EXAMS PPREPARING FOR EXERCISE EXAMS BUT FOLLOW THESE TIPS EVK

TS 10th Exams: ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

10th Exams Tips | తెలంగాణ‌లో త్వ‌ర‌లో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బోర్డు పరీక్షల కోసం చివ‌రి నిమిషంలో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రిపరేషన్ కావడానికి సమయం తక్కువగా ఉంది.

  తెలంగాణ‌లో త్వ‌ర‌లో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బోర్డు పరీక్షల కోసం చివ‌రి నిమిషంలో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రిపరేషన్ కావడానికి సమయం తక్కువగా ఉంది. దీంతో పూర్తి సిలబస్‌ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా టైం మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, సరైన షెడ్యూలింగ్‌తో పరీక్షలకు సన్నద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని టిప్స్ (Exam Tips) పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.

  HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 186 ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.55,000.. ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే చాన్స్‌

  ప్లానింగ్ అండ్ టైం మేనేజ్‌మెంట్
  విద్యార్థులు పరీక్షల కోసం మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. దీంతో వర్క్‌లోడ్ పెరిగి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే ప్రిపరేషన్‌కు సరైన ప్రణాళికలు వేసుకోవాలి. దీంతో పాఠ్యాంశాల్లో వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది. వాటికి అనుగుణంగా సమయం కేటాయించడానికి వీలు కలుగుతుంది.
  Telangana Exam Tips: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఎక్కు స్కోర్ సాధించేందుకు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి!

  మైండ్ మ్యాపింగ్
  ఈ నోట్ టేకింగ్ టెక్నిక్ వాస్తవానికి 1960లో ప్రముఖ రచయిత, విద్యా నిపుణుడు టోనీ బుజాన్ అభివృద్ధి చేశారు. గత కొన్నేళ్ల నుంచి సాంకేతికంగా అత్యంత ప్రభావవంతమైన విజువల్ లెర్నింగ్ సాధనాల్లో ఇది ఒకటిగా పేరుగాంచింది. ఈ పద్ధతి ద్వారా పాఠాలను సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చదివే అంశాన్ని విజువల్ రూపంలో గుర్తుకు తెచ్చుకునే విధంగా చేయడమే మైండ్ మ్యాపింగ్. 3 నుంచి 6 నెలల పాటు మ్యాప్ మ్యాపింగ్ ప్రక్రియను ఉపయోగించడం వల్ల సంక్లిష్ట పాఠాలను గుర్తుంచుకోవడంలో గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.
  IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.1,60,000 అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  ఫేన్‌మాన్ టెక్నిక్
  ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త, రచయిత అయిన రిచర్డ్ ఫేన్‌మాన్.. తాను ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఈ టెక్నిక్‌ను డెవలప్ చేశారు. క్లిష్టమైన భావనలను అర్థం చేసుకోవడానికి ఈ టెక్నిక్‌ను విస్తృతంగా అనుసరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రాథమికంగా పాఠాలను విడగొట్టి ఎక్కడ మనకు అర్థం కావడం లేదో గుర్తించి వాటిని పరిష్కరించడమే ఫేన్‌మాన్ టెక్నిక్ ఉద్దేశం.

  ఫ్లాష్ కార్డ్స్
  తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్‌లు గుర్తుంచుకోవడానికి ఈ పద్దతి బెస్ట్. దీన్ని ఉపయోగించి మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పేపర్ తీసుకొని దానిపై అంశాన్ని రాయండి. వెంటనే పేపర్ వెనుకవైపు ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు రాయండి. ఇలా సాధన చేయడాన్ని ఫ్లాష్ కార్డ్ కాన్సెప్ట్ అంటారు. ఇలా చేయడం వల్ల సమాచారం రీకలెక్ట్ అవుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు 10 అదనంగా సమాచారాన్ని గుర్తుంచుకుంటారని అధ్యాయనాల్లో తేలింది. పేపర్ బదులు అంకి, టినికార్డ్‌లు, క్విజ్‌లెట్ అనే ఆన్‌లైన్ సాధనాల ద్వారా ఈ టెక్నిక్‌ను ప్రాక్టీస్ చేయవచ్చు.

  కార్నెల్ నోట్‌టేకింగ్ సిస్టమ్
  ఈ టెక్నిక్‌ను 1950లో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాల్టర్ పాక్ డెవలప్ చేశారు. పాఠాలు వినే సమయంలో నోట్ పక్కన ఖాళీ కాలమ్‌ను ఉంచుతూ యాక్టివ్ నోట్-టేకింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ కాలమ్ వల్ల తరువాత మరోసారి సమాచారాన్ని గ్రహించడానికి, తిరిగి రివైజ్ చేసుకోవడానికి స్వయంగా విద్యార్థులే టెస్ట్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్‌ని చురుగ్గా చడవడం, రివైజ్ చేసుకోవడం, స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. దీంతో సబ్జెక్ట్‌ భావనపై అవగాహనలో వ్యత్యాసం ఎక్కువ ఉందో అంచనా వేయడానికి నోట్-టేకింగ్ పద్ధతి సహాయపడుతుంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, Exams, TS 10th Exams 2022

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు