TS 10TH EXAMS KNOW ABOUT TELANGANA TENTH CLASS TELUGU EXAM SYLLABUS NS MDK
TS 10th Exams: తెలంగాణలో ఈ నెల 23 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ఈ సారి తెలుగు సిలబస్ ఇదే..
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో త్వరలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు విద్యార్థుల ప్రిపరేషన్ కొనసాగుతోంది. మరి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్‌లో తెలుగు సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10కి10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు
ప్రశ్నల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకం పరిధి దాటి ప్రశ్నలు అడగరు. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదవడం ద్వారా 60 మార్కులు చాలా సులభంగా వస్తాయి. కొంచెం కష్టపడి చదివితే 75 మార్కులకు వరకు కూడా రావచ్చు. పద్య భాగానికి సంబంధించి 1.3.7.వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయి.కావున ప్రతి పాఠం చివర ఉన్న భాషాంశాలను కచ్చితంగా చదువుకోవాలి. ఎటువంటి గైడ్ అవసరం లేదు
లఘు సమాధాన ప్రశ్నలలో 3 పద్యభాగం నుండి 3 గద్య భాగం నుండి ఇస్తారు. కవి గురించి రచయిత ప్రశ్నల విషయానికొస్తే పద్యభాగం నుంచి ఒక కవి గురించి గద్యభాగం నుంచి ఒక రచయిత గురించి కచ్చితంగా ఇస్తారు. కావున ఏదైనా ఒక భాగం నుంచి కవులు లేదా రచయిత గురించి చదివితే సరిపోతుంది పుస్తకం మొత్తం కవుల రచయితల గురించి చదువన అవసరం లేదు. వ్యాస రూప ప్రశ్నలు విషయానికొస్తే మొత్తం ఆరు ప్రశ్నలు ఇందులో ఏవైనా మూడు కి సమాధానం రాయాలి.13 7=21మా2 ప్రశ్నలు పద్య పాఠాల నుండి రెండు ప్రశ్నలు గద్య పాఠాలు నుండి మరో రెండు ప్రశ్నలు రామాయణం నుండి ఇస్తారు.
విభాగం- బి{part-B} భాషాంశాల నుండి 20 మార్కులు ఇందులో 10 పదీ జాలం. 2 సొంత వాక్యాలు.2×1=2 ఒక్కోసారి జాతీయులు కూడా అడగవచ్చు మరియు 8×1=8👉 అర్థాలు పర్యాయ పదాలు పకృతి - వికృతులు రెండేసి చొప్పున నానార్ధాలు.వ్యుత్పత్తి అర్థాలు 1 చొప్పున ఇస్తారువ్యాకరణాంశాలు👉10×1=10 సంధులు సమాసాలు అలంకరణలు చందస్సు వ్యాఖ్యలు ఇస్తారు.సృజనాత్మకతలో భాగంగా పాఠ్యపుస్తకంలోని తొమ్మిది పాఠాలలో అనుకుంటా ఉన్నటువంటి ప్రక్రియలను అన్నిటినీ విద్యార్థులకు అభ్యాసం చేయించాలి .1×7=10 మా12) పబ్లిక్ పరీక్షల్లో ఈ విధంగా మార్కుల వరకు తెలుగు ప్రశ్న పత్రం వస్తుంది.
Disclaimer: పైన ఇచ్చిన వివరాలు విద్యార్థులకు అవగాహన కోసం మాత్రమే. పరీక్షల సిలబస్, మోడల్ పేపర్స్ లాంటి వివరాల కోసం విద్యార్థులు తెలంగాణ ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్ https://www.bse.telangana.gov.in/ ఫాలో కావాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.