హోమ్ /వార్తలు /jobs /

TS SSC Physics Model Paper: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫిజిక్స్ మోడల్ పేపర్ ఇదే..

TS SSC Physics Model Paper: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫిజిక్స్ మోడల్ పేపర్ ఇదే..

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ టెన్త్ సిలబస్ ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మారిన సిలబస్ కు అనుగుణంగా మోడల్ పేపర్ విద్యార్థుల కోసం..

    రచయిత: అచ్చ స్వప్న, ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-ఉర్లుగొండ, సూర్యాపేట జిల్లా.

    కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అనేక బోర్డు పరీక్షలను ఆయా ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పరీక్షల తేదీలను సైతం విడుదల చేశారు అధికారులు. అయితే.. ఈ ఏడాది కూడా కొన్ని రోజుల పాటు ఆన్లైన్ విధానంలోనే విద్యా బోధన జరిగింది. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం, విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉండడంతో సిలబస్ ను కొంత మేర తగ్గించారు. దీంతో ప్రశ్నాపత్రాల కూర్పు కూడా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఇందులో భాగంగా సూర్యాపేట జిలా ఉర్లుగొండ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు అచ్చ స్వప్న అందించిన ఫిజిక్స్ మోడల్ పేపర్ వివరాలు విద్యార్థుల కోసం..

    మొత్తం పార్ట్ ఏ, పార్టీ బీగా పేపర్ విభజింపబడుతుంది. పార్ట్ ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి.

    -మొదటి సెక్షన్లో 6 ప్రశ్నలు ఉంటాయి. అందుటో మూడు రాయాలి. ఒక్కో ప్రశ్నలకు రెండు మార్కులు మొత్తం 3*2=6మార్కులు.

    -సెక్షన్ 2 లో 4 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 2*4=8 మార్కులు.

    -సెక్షన్-3లో 4 ప్రశ్నలు ఉంటాయి. రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. మొత్తం 2*8=16. మార్కులు.

    పార్ట్ బీలో..

    -పార్ట్ బీలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. 10*1=10.

    మంచి మార్కుల కోసం టిప్స్..

    -బేధాలు అడిగినప్పుడు పట్టిక రూపంలో రాస్తే బాగుంటుంది.

    -కిరణరేఖా చిత్రాలను ప్రతిబంబ లక్షణాలను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి.

    -ఈ సారి సిలబస్ లో 30 శాతం సిలబస్ ను తొలగించారు. మానవుని కన్ను రంగుల ప్రపంచం పాఠ్యంశంలో కాంతి పరిక్షేపణం, రసాయనబంధం, విద్యుదయస్కాంతం, కార్బన్ దాని సమ్మేళనాలు తొలగించారు. విద్యార్థులు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి.

    -ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, విద్యుత్ ప్రవాహం, గోళాకర దర్పణాలతో కాంతి -పరివర్తనం పాఠ్యాంశాలతో పట్టికలను బాగా అవగతం చేసుకోవాలి.

    -ఫార్ములాలు, ప్రమాణాలను బాగా నేర్చుకోవాలి.

    First published:

    ఉత్తమ కథలు