హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ ఎగ్జామ్ ఇలా.. తెలుసుకోండి

TS 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ ఎగ్జామ్ ఇలా.. తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సిలబస్ తగ్గించింది తెలంగాణ సర్కార్. అందులో భాగంగా పదో తరగతి సామాన్య శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి గతంలో రెండు పేపర్లు ఉండగా.. ఈ సారి ఒకే ప్రశ్నపత్రం పెట్టి పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇంకా చదవండి ...

సేకరణ: సయ్యద్ రఫీ, న్యూస్18 కరస్పాండెంట్, మహబూబ్ నగర్

రచయిత: జరీనా బేగం, ఉపాధ్యాయురాలు, TSWRS, దామరగిద్దా, నారాయణపేట మండలం

గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ (Covid 19) కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు (TS Tenth Exams) నిర్వహించకుండానే పాస్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ సారి ఎలాగైనా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సిలబస్ తగ్గించింది. అందులో భాగంగా పదో తరగతి సామాన్య శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి గతంలో రెండు పేపర్లు ఉండగా.. ఈ సారి ఒకే ప్రశ్నపత్రం పెట్టి పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి సామాన్య శాస్త్రం మోడల్ పేపర్(Model Papers) ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

పదవ తరగతి సామాన్య శాస్త్రం ఎగ్జామ్ ను భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం రెండు పేపర్లుగా విభజించారు. భౌతిక రసాయన శాస్త్రం 40 మార్కులు కాగా సమయం 01:35 గంటలు. జీవశాస్త్రం 40 మార్కులు కాగా సమయం 1:35.గంటలు. ఈ విద్యా సంవత్సరంలో సామాన్య శాస్త్రం ఎగ్జామ్ ఒకటే రోజు నిర్వహిస్తారు. భౌతిక రసాయన శాస్త్రం 40 మార్కులు సమయం 01:35 గంటలు. జీవశాస్త్రం 40 మార్కులు సమయం 01:35 గంటలు. ఈ ఎగ్జామ్స్ లో పార్ట్ ఏ లోని సెక్షన్-1లో మొత్తం ఆరు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి మూడు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం మూడు ప్రశ్నలకు ఆరు మార్కులు. 3×2=6.మార్కులు. సెక్షన్ టూ లో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.

Tenth English paper: 10వ తరగతి ఇంగ్లీష్​ పేపర్​ ఎలా ఉండబోతుంది.. సమాధానాలు రాసే విధానం గురించి నిపుణుల సూచనలు మీ కోసం..

ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు రెండు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు. 2×4=8 మార్కులు కేటాయించనున్నారు. సెక్షన్ మూడు లో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఎనిమిది మార్కుల చొప్పున మొత్తం 16 మార్కులు..2×8=16.మార్కులు. పార్ట్ బి..మొత్తం మార్కులు 10..పార్ట్ బిలో మొత్తం పది ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 10 మార్కులు కేటాయించారు. 10×1=10 మార్కులు. భౌతిక రసాయన శాస్త్రం.. పార్ట్ ఏ.సెక్షన్ ఒక్కటి లో ఈ విధంగా ఉంటుంది..  3×2=6..సెక్షన్- 2లో 2×4=8..సెక్షన్-3 లో 2×8=16.పార్టు బి లో...10×1=10... ఈ విధంగా భౌతిక రసాయన జీవ శాస్త్రం పరీక్ష పత్రం ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Exams, TS 10th Exams 2022

ఉత్తమ కథలు