Home /News /jobs /

TS 10TH CLASS HINDI EXAM TIPS SPECIAL FOR ADVANCED STUDENTS SPECIAL TIPS FOR GOOD SCORE IN HINDI GNT EVK

TS 10th Class Hindi Exam Tips: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌త్యేకం.. హిందీలో మంచి స్కోర్ కోసం స్పెష‌ల్ టిప్స్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS 10th Class Hindi Tips | పదవతరగతి విద్యార్థులకు మైలు రాయి వంటిది.విద్యార్థి సామర్ధ్యాన్ని లెక్కవేయటాని పడవ తరగతి మార్కులు ఎంతో కీలకం మంచి మార్కులు సాధించడమే లక్ష్యం. కాస్త ప్రణాళికతో వెళితే అదంత కష్టం కాదంటున్నారు నిపుణులు.

    సేకరణ - అన్నా రఘు, అమరావతి, న్యూస్ 18 తెలుగు
    రచయిత - శ్రీదేవి, హిందీ ఉపాధ్యాయురాలు, జిల్లాపరిషత్ పాఠశాల, నకిరేకల్లు

    పదవతరగతి విద్యార్థులకు మైలు రాయి వంటిది.విద్యార్థి సామర్ధ్యాన్ని లెక్కవేయటాని పడవ తరగతి మార్కులు ఎంతో కీలకం మంచి మార్కులు సాధించడమే లక్ష్యం. కాస్త ప్రణాళికతో వెళితే అదంత కష్టం కాదంటున్నారు నిపుణులు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షా విధానంపై పరిపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి.
    కరోనా వలన మొదట్లో కొంత విద్యార్థులు క్లాసులు జరగక ఇబ్బంది పడ్డ తరువాత జరిగిన పరిణామాలతో క్లాస్ లు జరిగాయి ఇప్పటికే అన్ని విద్యాలయాలలో సిలబస్ రెండు మూడు సార్లు రివిజన్ కూడా జరిగింది.

    CBSE Subjects: తెలుగు తప్పనిసరి.. సీబీఎస్ఈలో వ‌చ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాలు

    పరీక్షలకు చాలా వ్యవధి ఉందనే విషయాన్ని గమనించి పరీక్షల భయాన్ని వదిలేయాలి. ఆందోళన మొదలైతే చదివింది మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రయత్నపూర్వకంగానైనా ప్రశాంతతను అలవాటు చేసుకోవాలి. ప్రణాళిక  లేకుండా ఏ పని చేసినా గందరగోళంగా ఉంటుంది. అందుకే అన్ని విధాలా అనుకూలమైన స్వీయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.  హిందీ పరీక్షలో నకిరేకల్లు జిల్లాపరిషత్ హిందీ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు  పరీక్షలో అత్యధిక మార్కులు తెచుకోవటానికి కొన్ని చిట్కాలు న్యూస్ 18 తో పంచుకున్నారు.

    TSPSC Group 1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ఇంట‌ర్వ్యూల ర‌ద్దు నేప‌థ్యంలో కీల‌క మార్పు!

    హిందీ వ్యాకరణం, కవి పరిచయ్, దోహేలు వాటి సారాంశం, లింగ, వచనాలు మార్పు , వ్యతిరేక పదాలు మరియు ముఖ్యమైన భారతీయ పండుగలు, పర్యావరణ కాలుష్యము మరియు మిత్రులకు లేఖలూ బాగుగా సాధన చెయ్యాలి.భాష, వ్యాకరణం, సృజనాత్మక అంశాల్లో విద్యార్థి ప్రతిభను పరీక్షించే విధంగా హిందీ సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. కొత్త విధానంలో రెండు నూతన అంశాలను పొందుపరిచారు. ఒకటి ప్రకటన (అడ్వర్టైస్‌మెంట్‌), రెండోది హింట్‌ స్టోరీ.

    ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ విధానం..

    ప్రకటన చదివి ప్రశలకు జవాబులు రాయాలి. హింట్‌ స్టోరీకి సంబంధించి ఏదో ఒక తెలుగు కథని హిందీలో ఇస్తారు. దాన్ని చదివి విభక్తులతో పూర్తి చేయాలి. అన్ని పాఠ్యాంశాలకు ప్రశ్నాపత్రంలో సమానమైన వెయిటేజీ ఉంది.

    భాషాకీ బాత్‌ (వ్యాకరణం), అర్థగ్రాహ్యతా ప్రతిక్రియ (అవగాహన, ప్రతిస్పందన), అభివ్యక్తి (పాఠాల్లోని ప్రశ్నలకు, తగిన జవాబులు రాయడం), సృజనాత్మక విభాగాలుగా ప్రశ్నతం ఉంటుంది. ప్రధానంగా సారాంశాలు, పత్ర్, నిబంధ్, వ్యాకరణాంశాలపై దృష్టిపెట్టాలి. భాషాకీ బాత్‌ జాత్రగత్తగా అవగాహన చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హిందీ రాయడం ఎవరికైతే బాగా వస్తుందో వారు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు తగిన విధంగా అభ్యాసం చేయాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th Class Exams, Career and Courses, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు