H-1B వీసాలకు చెక్...భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ మరో షాక్

ఫెడరల్ ఏజెన్సీలు కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ ద్వారా కూడా హెచ్1 బీ వీసాలపై అక్కడున్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు.

news18-telugu
Updated: August 4, 2020, 12:18 PM IST
H-1B వీసాలకు చెక్...భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై కన్నేసిన భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పెద్ద షాక్ ఇచ్చారు. తమ దేశంలోని ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ ఉద్యోగాలను నియమించుకోకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మరీ ముఖ్యంగా H-1B వీసాపై తమ దేశంలో ఉంటున్న వలసదారులను కాంట్రాక్టు లేదా సబ్ కాంట్రాక్టు మీద కూడా ఫెడరల్ ఏజెన్సీలు ఉద్యోగాల్లో పెట్టుకోకూడదని తన ఆదేశాల్లో ఆయన స్పష్టంచేశారు. అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. విదేశీ కార్మికులు చౌకగా వస్తారన్న కారణంగా...కష్టపH1డి పనిచేసే అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడాన్ని తన పాలనలో సహించబోనని ఆయన స్పష్టంచేశారు.

తమ దేశంలో నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేనిస్థాయికి చేరిన నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబరు మాసంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో నిరుద్యోగ సమస్య చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ నిపుణుల ఉద్యోగ అవకాశాల్లో కోతపెట్టేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం


అమెరికన్ల ఉద్యోగులకు విదేశీ నిపుణులు ఎసరపెడుతున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచీ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో H-1B వీసాలతో పాటు ఇతర అన్ని రకాల విదేశీ వర్క్ వీసాల జారిని సస్పెండ్ చేస్తూ జూన్ 23న ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉండనున్నాయి. ఇప్పటికే H-1B వీసాలతో అమెరికాలో ఉంటున్న వారికి ఫెడరల్ ఏజెన్సీలు ఉద్యోగుల ఇవ్వకూడదని ట్రంప్ తాజా ఆదేశాలివ్వడం భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర నష్టం కలిగించనుంది.

ప్రతీకాత్మక చిత్రం


ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలోని పలు కార్పొరేట్, టెక్నాలజీ సంస్థలలు వ్యతిరేకిస్తున్నాయి. H-1B వీసాలపై ఆంక్షలు దేశంలో ఉద్యోగ కల్పనకు విఘాతం కలుగుతుందని చెబుతున్నారు. భారత్, చైనా దేశాల నుంచి ఐటీ, టెక్ నిపుణులు H-1B వీసాలపై అమెరికాకు వచ్చి అక్కడి కంపెనీల్లో పనిచేస్తుంటారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ దేశంలోని కార్పొరేట్ కంపెనీలు H-1B వీసాలపై విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంటోంది.
Published by: Janardhan V
First published: August 4, 2020, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading