Father's Day 2020 | ఇంటర్ ఫలితాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ముందే ఫాదర్స్ డే...

TS Inter Results 2020 | తన కుమార్తె సాధించిన ఘనతను చూసి గర్వపడుతున్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

news18-telugu
Updated: June 18, 2020, 10:48 PM IST
Father's Day 2020 | ఇంటర్ ఫలితాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ముందే ఫాదర్స్ డే...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • Share this:
పుత్రోత్సాహంబు తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతీ...!

ఇది సుమతీ శతకంలో పద్యం. అయితే, ఇక్కడ కుమార్తెను చూసి గర్వపడుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తన కుమార్తె సాధించిన ఘనతను చూసి గర్వపడుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుమార్తె అనౌష్క రెడ్డి ఇంటర్మీడియట్ ఏ గ్రేడ్‌తో పాస్ అయ్యారు. ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలను ఆమె ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో జీవన్ రెడ్డి కుమార్తె అనౌష్క రెడ్డి పాస్ అయ్యారు. మొత్తం 972 మార్కులు సాధించారు. ఇంగ్లీష్ పేపర్ 2లో 94, సంస్కృతం పేపర్ 2లో 99 మార్కులు వచ్చాయి. ఆ రిజల్ట్స్‌ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘నువ్వు ఎప్పుడూ గ్రేట్ బేటా. కంగ్రాట్యులేషన్స్.’ అంటూ అభినందిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: June 18, 2020, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading