Home /News /jobs /

TRICKY QUESTIONS IN MATH MAY BE DECIDING FACTOR IN JEE MAINS UMG GH

JEE Main Day 5: జేఈఈ మెయిన్ ఐదో రోజు ఎగ్జామ్‌.. మ్యాథ్స్ ప్రశ్నలే డిసైడింగ్ ఫ్యాక్టర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 27న జరిగిన JEE మెయిన్ 2022 పరీక్షకు హాజరైన విద్యార్థులు గణిత (mathematics) విభాగం కష్టంగా ఉన్నట్లు గుర్తించారు. డిఫికల్టీ పరంగా పరీక్ష ఓవరాల్‌గా మోడరేట్ లెవల్‌గా ఉన్నప్పటికీ, మ్యాథ్స్ సెక్షన్‌లోని కొన్ని ప్రశ్నలు మాత్రం క్రిటికల్‌గా వచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇంకా చదవండి ...
దేశంలోని ఇంజినీరింగ్ (Engineering) విద్యాసంస్థల్లో ప్రవేశాల (Entrance) కోసం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. జూన్ 27న ఐదో రోజు కొందరు అభ్యర్థులు పరీక్షలు రాశారు. జూన్ 27న జరిగిన JEE మెయిన్ 2022 పరీక్షకు హాజరైన విద్యార్థులు గణిత (mathematics) విభాగం కష్టంగా ఉన్నట్లు గుర్తించారు. డిఫికల్టీ పరంగా పరీక్ష ఓవరాల్‌గా మోడరేట్ లెవల్‌గా ఉన్నప్పటికీ, మ్యాథ్స్ సెక్షన్‌లోని కొన్ని ప్రశ్నలు మాత్రం క్రిటికల్‌గా వచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఈ ట్రిక్కీ క్వశ్చన్స్ డిఫికల్ట్‌గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా అత్యంత కష్టతరమైన సెక్షన్‌గా ఫిజిక్స్‌ ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్‌లో ఫిజిక్స్ మధ్యస్థంగానే ఉన్నట్లు చాలా మంది విద్యార్థులు చెప్పారు.

ఈ విషయంపై ఆకాష్ + బైజూస్ ఇంజనీరింగ్ నేషనల్ అకడమిక్ డైరెక్టర్ అజయ్ శర్మ మాట్లాడారు. ‘జూన్ 27 నాటి జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌ డిఫికల్టీ మధ్యస్థంగా ఉందని చాలా మంది విద్యార్థులు చెప్పారు. కాలిక్యులస్ నుంచి 7- 8 ప్రశ్నలు, ఆల్జీబ్రా నుంచి ఆరు ప్రశ్నలు, వెక్టర్స్ అండ్ 3D నుంచి రెండు ప్రశ్నలు, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఐదు ప్రశ్నలు ఉన్నాయి’ అని వివరించారు.

న్యూమరికల్ సెక్షన్‌లో లెన్తీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని, కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని FIITJEE నిపుణుడు రమేష్ బట్లిష్ చెప్పారు. ‘అన్ని చాప్టర్స్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. కోనిక్ సెక్షన్స్, ఆల్జీబ్రా భాగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ప్రాబబిలిటీ, డిటర్మినెంట్స్, ప్రోగ్రెషన్స్, స్ట్రెయిట్ లైన్స్ అండ్ ఎలిప్సెస్, 3D జామెట్రీ, డెఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వంటి టాపిక్స్ నుంచి మంచి ప్రశ్నలు అడిగారు’ అని విశ్లేషించారు.

అయితే ఎగ్జామ్ డిఫికల్టీ గురించి మాత్రం ఈ ఇద్దరు నిపుణులు ఒకే అభిప్రాయానికి వచ్చారు. మ్యాథ్స్ సెక్షన్ అత్యంత కఠినమైన విభాగమని, ఆ తర్వాత ఫిజిక్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని చెప్పారు. అన్ని సెక్షన్లలో కెమిస్ట్రీ ఈజీగా ఉందని అంగీకరించారు. ‘ఫిజికల్, ఆర్గానిక్, ఇన్‌ఆర్గానికి పోర్షన్స్‌ నుంచి ప్రశ్నలు అడిగారు. పేపర్ మొత్తం బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఇవన్నీ NCERT బుక్స్, ఎగ్జాంపుల్స్ నుంచే వచ్చాయి. వీటిని కవర్ చేసిన వారు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, బయోమోలిక్యూల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ వంటి చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి.’ అని శర్మ వివరించారు.

ఆర్గానిక్, ఇన్‌ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజికల్ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజీ ఇచ్చారని బట్లిష్ చెప్పారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, అయానిక్ ఈక్విలిబ్రియం, సాలిడ్-స్టేట్‌, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి న్యూమరికల్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పి-బ్లాక్, ఫినాల్స్, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి కూడా ప్రశ్నలు అడిగారని బట్లిష్ తెలిపారు. ఫిజిక్స్‌లో కైనమాటిక్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిజం, AC సర్క్యూట్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ నుంచి ప్రశ్నలు అడిగారని, న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయని బట్లిష్ వెల్లడించారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Jee, Jee mains 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు