తెలంగాణలోని గురుకుల మహిళల డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్-TREIRB. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు 2020 మార్చి 30న ముగిసింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. జూన్ 5 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సబ్మిట్ చేయొచ్చు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-TSWREIS, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-TTWREIS ఆధ్వర్యంలోని మహిళల డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://treirb.telangana.gov.in/ లేదా https://www.treirb.net/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

Source: treirb.telangana.gov.in
TREIRB Principal Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ప్రిన్సిపాల్ పోస్టులు- 34
TSWREIS డిగ్రీ కాలేజీలు- 19
TTWREIS డిగ్రీ కాలేజీలు- 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 5 సాయంత్రం 5 గంటలువిద్యార్హత- 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. పీహెచ్డీ ఉండాలి.
అనుభవం- తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా లేదా 5 ఏళ్లు లెక్చరర్‌గా లేదా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో 7 ఏళ్లు లెక్చరర్‌గా లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7 ఏళ్లు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా లేదా యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కళాశాలల్లో 7 ఏళ్లు అకడమిక్ కన్సల్టెంట్‌గా లేదా 5 ఏళ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7 ఏళ్లు జూనియర్ లెక్చరర్‌గా లేదా ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 9 ఏళ్లు రెగ్యులర్ జూనియర్ లెక్చరర్‌గా లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాల్లోల 9 ఏళ్లు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు- 34 నుంచి 44 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.2,000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.1,200.
దరఖాస్తు విధానం- అభ్యర్థులు TREIRB వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని, ప్రింట్ తీసి, అన్ని డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తుల్ని నోటిఫికేషన్లో సూచించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Chairman, Telangana Residential Educational Insitutions Recuitment Board,
4th Floor, D.S.S Bhavan, Masab Tank,
HYDEABAD - 500028.
తెలంగాణలోని గురుకుల మహిళల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు
DRDO Jobs: డీఆర్డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... మే 31 చివరి తేదీ