Army Jobs: బీటెక్ విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Army Recruitment 2019 | మొత్తం 189 ఖాళీలున్నాయి. అందులో పురుషులకు 175, మహిళలకు 14 పోస్టుల్ని కేటాయించారు.

news18-telugu
Updated: August 20, 2019, 11:52 AM IST
Army Jobs: బీటెక్ విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Army Jobs: బీటెక్ విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 20, 2019, 11:52 AM IST
ఇంజనీరింగ్ విద్యార్థులకు, బీటెక్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌లో భాగంగా పెళ్లి కాని పురుషులు, మహిళలతో పాటు ఆర్మీ సిబ్బంది వితంతుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. దరఖాస్తుకు ఆగస్ట్ 22 చివరి తేదీ. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారితో పాటు కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులకు, మహిళలకు వయస్సు 20 నుంచి 27 ఏళ్లు ఉండాలి. డిఫెన్స్ సిబ్బంది వితంతులకు 35 ఏళ్లు మించకూడదు. మొత్తం 189 ఖాళీలున్నాయి. అందులో పురుషులకు 175, మహిళలకు 14 పోస్టుల్ని కేటాయించారు. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్ తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.








Loading...




















































 ఇంజనీరింగ్ విభాగం  పురుషులు  స్త్రీలు
 సివిల్  46  04
 మెకానికల్  14  02
 ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్  22  02
 ఏరోనాటికల్ / బాలిస్టిక్స్ / ఏవియానిక్స్  12  0
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్  44  03
 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ శాటిలైట్ కమ్యూనికేషన్  23  02
 ఎలక్ట్రానిక్స్ / ఆప్టో ఎలక్ట్రానిక్స్ / ఫైబర్ ఆప్టిక్స్ / మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్  08 0
 ప్రొడక్షన్ ఇంజనీరింగ్  03  0
 ఆర్కిటెక్చర్ / బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ  03  01
 మొత్తం  175  14

ఇంజనీర్ గ్రాడ్యుయేట్ల నియామకానికి ఇండియన్ ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...