TOP PROGRAMMING LANGUAGES TO GET A JOB AT WIPRO INFOSYS TCS COGNIZANT GH VB
Software Jobs: ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే.. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రోలలో కొలువు గ్యారెంటీ..
తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏడాది చాలా ముఖ్యం.. మిస్ అయితే చాలా కష్టం.. ఎందుకంటే?
ఐటీ రంగం(IT Indudtries) వేగంగా అభివృద్ది(development) చెందుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ మందిని రిక్రూట్ (Recruitments) చేసుకుంటున్నాయి కంపెనీలు. అయితే ఐటీ రంగంలో (IT Sector) కలల కొలువు సాధించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై (Programming Languages) పట్టు సాధించాల్సిందే.
ఐటీ రంగం(IT Indudtries) వేగంగా అభివృద్ది(development) చెందుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ మందిని రిక్రూట్ (Recruitments) చేసుకుంటున్నాయి కంపెనీలు. అయితే ఐటీ రంగంలో (IT Sector) కలల కొలువు సాధించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై (Programming Languages) పట్టు సాధించాల్సిందే. ప్రస్తుతం మొత్తం250 నుంచి 700 వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని అంచనా. అయితే ఈ వందలాది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కొన్ని మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ నేర్చుకున్న వారినే టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(INfosis), కాగ్నిజెంట్(Cognizent), విప్రో (Wipro) వంటి ఐటీ దిగ్గజాలు నియమించుకుంటాయి. ఐటీ కొలువు దక్కించుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్‌పై ఓలుక్కేయండి.
పైథాన్..
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా మీ కెరీర్ ప్రారంభించాలంటే పైథాన్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాల్సిందే. ఎందుకంటే, పైథాన్పైనే ఎక్కువ కంపెనీలు పనిచేస్తున్నాయి. అందుకే మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా పైథాన్ రాణిస్తోంది. ఈ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడం, చదవడం, రాయడం చాలా సులభం.
జావా..
జావా అనేది అత్యంత పాపులర్ ఆబ్జెక్ట్ -ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రోగ్రామర్లు జావాతోనే కోడింగ్ రాస్తారు. సీ, సీ++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను వెనక్కు నెట్టి ఇప్పటికీ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్‌గా రాణిస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ కారణంగా అనేక ప్రసిద్ధ కంపెనీలు జావా లాంగ్వేజ్‌ను వాడుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో ప్రస్తుతం జావా డెవలపర్లకు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ నియమించుకుంటున్నాయి.
జావాస్క్రిప్ట్..
జావాస్క్రిప్ట్ (జేఎస్) వెబ్ డెవలప్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లయింట్ వైపు, సర్వర్ వైపు ఈజీగా యాక్సెస్ చేయగలిగేలా జావా స్క్రిప్ట్‌తో ప్రోగ్రామ్ రాయవచ్చు. దీన్ని ఇంటరాక్టివ్ మల్టీమీడియా వెబ్ పేజీల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు.
సీ/ సీ++..
సీ అనేది స్టాటిక్, జనరల్ పర్పస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కు సీ లాంగ్వేజ్ బేస్. జావా, ఫైథాన్ వంటి అప్డేటెస్ లాంగ్వేజెస్ వచ్చినప్పటికీ.. ఇంకా చాలా కంపెనీలు సీ/సీ++ లాంగ్వేజెస్‌ను వాడుతున్నాయి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, మెడికల్ అప్లికేషన్ల కోసం వీటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి.
గోలాంగ్..
గో అనేది సులభమైన, వేగవంతమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి డెవలప్ చేసిన ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్‌ను గూగుల్ సంస్థ డెవలప్ చేసింది. అయితే, చాలా తక్కువ సంస్థలు మాత్రమే గోలాంగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నాయి.
రస్ట్..
రస్ట్ అనేది సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా వేగంగా ప్రోగ్రామ్‌ను రన్ చేస్తుంది. రస్ట్ లాంగ్వేజ్ సెగ్ఫాల్ట్లను నివారిస్తుంది. ఇది థ్రెడ్ భద్రతకు హామీ ఇస్తుంది. 2021లో మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్‌గా రస్ట్ నిలిచింది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వారికి భారీ వేతనాలు లభిస్తున్నాయి.
స్కాలా..
స్కాలా అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది బలమైన స్టాటిక్ టైప్ సిస్టమ్‌కు మద్దతిచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్కాలాను అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.