Home /News /jobs /

TOP INTERNSHIP PROGRAMS FOR FRESHERS AND STUDENTS KNOW DETAILS EVK

Internship: ఫ్రెషర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కోసం టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Internship: మెరుగైన ఉద్యోగ అవ‌కాశాల‌ను పొంద‌డానికి.. కెరీర్‌ (Career)ను నిర్ణ‌యించుకోవ‌డానికి విద్యార్థుల‌కు ఇంట‌ర్న్‌షిప్ (Internship) చాలా అవ‌స‌రం. ఇందుకోసం ప్ర‌ముఖ సంస్థ‌లు ఇంట‌ర్న్‌షిప్ అందిస్తున్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకోండి

ఇంకా చదవండి ...
    మెరుగైన ఉద్యోగ అవ‌కాశాల‌ను పొంద‌డానికి.. కెరీర్‌ను నిర్ణ‌యించుకోవ‌డానికి విద్యార్థుల‌కు ఇంట‌ర్న్‌షిప్ (Internship) చాలా అవ‌స‌రం. క‌రోనా (Corona) త‌రువాత ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యా వ్య‌వ‌స్థ‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. అలాగే వర్క్-ఫ్రమ్-హోమ్ (Work-From-Home) విధానం పెరిగింది. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే వారికి ఈ స‌మ‌యంలో ఇంట‌ర్న్‌షిప్ చాలా అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో ఇంట్లో నుంచే వ‌ర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంట‌ర్న్‌షిప్ చేసే అవ‌కాశాల‌ను ప‌లు సంస్థ‌లు క‌ల్పిస్తున్నాయి. వాటి వివ‌రాల‌ను తెలుసుకోండి..

    టీం ఎవ‌రెస్ట్ (Team Everest) - భారతదేశంలో యువత నిర్వహించే అతిపెద్ద NGOలలో ఒకటైన టీమ్ ఎవరెస్ట్, 'డిజైన్ ఎ గేమ్' కోసం డ‌బ్ల్యూహెచ్ (WFH) ఇంటర్న్‌షిప్‌లను అందిస్తోంది. ఇంటర్న్‌షిప్‌లో వర్చువల్ గేమ్‌ల గురించి పరిశోధనలు నిర్వ‌హిస్తారు. ఈ కోర్సుల‌కు ఆసక్తి ఉన్న వారు డిసెంబర్ 21 ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంట‌ర్న్‌షిప్‌లో ఎటువంటి చెల్లింపులు చేయ‌రు.

    PhonePe Jobs: ఫోన్‌పేలో మ్యూచ్‌వ‌ల్ ఫండ్ స్పెష‌లిస్ట్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్‌కు అవ‌కాశం




    ఎర్త్5ఆర్(Earth5R)- ఇది ఒక పర్యావరణ సంస్థ, 'ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్' పోస్ట్ కోసం WFH ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఇంటర్న్ ప్లాస్టిక్ వ్యర్థాల నమూనాను రూపొందించాలి. పరిశోధన ప్రయోజనాల కోసం వేరు చేయబడిన వ్యర్థాల డేటాను విశ్లేషించాలి. అదనంగా, అభ్యర్థులు 'ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్థాలను వేరుచేసే పద్ధతులు, హానికరమైన ప్రభావాల'పై పౌరులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 14 లోపు ఇంట‌ర్న్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    టీచ్ ఫర్ ఇండియా (Teach For India) - ఇది టీచ్-ఫర్ ఆల్ నెట్‌వర్క్ సంబంధించింది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌ మూడు నెలల ప్రాజెక్ట్‌లో ఒక చిన్న గ్రూప్ విద్యార్థులను పర్యవేక్షించగల అభ్యర్థుల కోసం ‘స్టూడెంట్ మెంటరింగ్ ఇంటర్న్‌షిప్’ని అందిస్తోంది. డిసెంబర్ 6 నాటిక‌ల్లా దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంట‌ర్న్‌షిప్ వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా అందిస్తుంది.

    స్పోర్ట్స్కీడా (Sportskeeda) - ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలో ఎంతో గుర్తింపు ఉన్న సంస్థ స్పోర్ట్స్కీడా (Sportskeeda), శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Search Engine Optimization) వ‌ర్క్ ఫ్రం హోం ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థి రోజువారీ పనులలో SEO బృందానికి సాయం చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఆరు నెలలు మరియు అభ్యర్థులు డిసెంబర్ 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ఇంట‌ర్న్‌షిప్‌ అభ్యర్థికి నెలకు రూ.10,000 స్టైపెండ్ అందిస్తారు.

    RBI Internship : ఆర్‌బీఐలో ప‌ని చేయాల‌నుకొంటున్నారా..? అయితే ట్రై చేయండి


    గ్రేడ్అప్, గ్రేడ్‌స్టాక్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Gradeup, GradeStack Learning Private Limited) - ఈ సంస్థ కంటెంట్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. అభ్యర్థి UGC-NET (కంప్యూటర్ అప్లికేషన్ యొక్క పేపర్ 2) కోసం తాజా ప్రశ్నలను త‌యారు చేయాలి. NET, SET యొక్క మునుపటి సంవత్సరం పేపర్‌లకు పరిష్కారాలను రాయాలి. డిసెంబరు 16 నాటికి ఇంటి నుంచి ఉద్యోగం/ఇంటర్న్‌షిప్ నుంచి పనిని ప్రారంభించగల అభ్యర్థికి. అభ్యర్థికి నెలకు రూ. 1000-4000 స్టైపెండ్ ఇవ్వబడుతుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, Internship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు