హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Govt Internships: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!

Govt Internships: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!

ఇంటర్నెషిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్నెషిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

వివిధ రంగాల్లో నైపుణ్యాలను సంపాదించుకోవడానికి ఇంటర్న్‌షిప్ (Internship) ప్రోగ్రామ్‌లు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్‌ స్కాలర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు సంస్థలు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులు (Applications) ఆహ్వనిస్తోంది.

ఇంకా చదవండి ...

వివిధ రంగాల్లో నైపుణ్యాలను సంపాదించుకోవడానికి Internship ప్రోగ్రామ్‌లు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్‌ స్కాలర్స్ నుంచి Central Government ఆధీనంలోని పలు సంస్థలు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ల కోసం Applications ఆహ్వానిస్తున్నాయి. ఈ జాబితాను పరిశీలిద్దాం.

నీతి ఆయోగ్

కేంద్ర ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం, డేటా మేనేజ్‌మెంట్ అండ్ అనాలసిస్, ఆర్థికశాస్త్రం, ఎడ్యుకేషన్, మానవ వనరుల అభివృద్ధి, ఇంధన రంగం, విదేశీ వాణిజ్యం/వాణిజ్యం, మైనింగ్, పర్యాటకం, క్రీడలు వంటి రంగాలకు చెందిన విద్యార్థులు నీతి ఆయోగ్ ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ కనీసం ఆరు వారాల నుంచి గరిష్టంగా ఆరు నెలల వరకు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోర్టల్ niti.gov.in/internshipను సందర్శించవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ప్రతి నెల 1వ తేదీ నుంచి10 వరకు ఓపెన్‌లో ఉండనుంది.

కేంద్ర న్యాయ శాఖ

రాజ్యాంగం- పరిపాలనా చట్టం, ఫైనాన్స్ లా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లా, ఆర్థిక చట్టం, కార్మిక చట్టం, రవాణా, మధ్యవర్తిత్వం- ఒప్పంద చట్టం తదితర అంశాలకు సంబంధించిన రీసెర్చ్, రిఫరెన్సింగ్ వర్క్‌లో లా స్టూడెట్స్ మరింత అనుభవం సాధించడానికి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇంటర్న్‌షిప్‌‌ను ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 2 లేదా 3వ సంవత్సరంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల/లా స్కూల్/యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి 3, 4, లేదా 5వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల లేదా లా స్కూల్ లేదా యూనివర్సిటీ నుంచి LLB కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ legalaffairs.gov.in/internship ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ట్విటర్ వేదికగా విద్యార్థుల ఆందోళన. హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన.. ఆ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ డిమాండ్


విదేశీ వ్యవహారాల శాఖ

75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులు internship.mea.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా మూడు నెలలు వరకు ఉంటుంది.

డిజిలాకర్

డిజిలాకర్‌లో ఇంటర్న్‌షిప్‌లు డెవలప్‌మెంట్, ఆపరేషన్‌ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా సెక్యూరిటీ రీసెర్చర్ / టెస్టింగ్, కంటెంట్ రైటర్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, UI/UX, గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, IOS డెవలప్‌మెంట్ తదితర రంగాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇంటర్న్ షిప్ కనీసం ఆరు నెలల పాటు ఉంటుంది. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ digilocker.gov.in/internshipను సందర్శించవచ్చు.

నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా

ఈ సంస్థ రిసెర్చ్ బేస్డ్ ఇంటర్న్‌షిప్‌‌ ఆఫర్ చేస్తోంది. మ్యూజియంకు సంబంధించిన విభాగాల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా మ్యూజియంకు సంబంధించిన ఆంత్రోపాలజీ, సెంట్రల్ ఏషియన్ యాంటిక్విటీస్, ఆర్కియాలజీ, కన్జర్వేషన్, ఆర్మ్స్ అండ్ ఆర్మర్స్, డెకరేటివ్ ఆర్ట్స్, డిస్‌ప్లే, ఎడ్యుకేషన్, ఎగ్జిబిషన్, లైబ్రరీ, మాన్యుస్క్రిప్ట్స్, అవుట్‌రీచ్, మోడలింగ్, న్యూమిస్మాటిక్స్, పెయింటింగ్, ప్రీ-కొలంబియన్ వెస్ట్రన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, ప్రీ-హిస్టారిక్ ఆర్కియాలజీ వంటి విభాగాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ nationalmuseumindia.gov.in/en/national-museum-internship-programme ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS

ఉత్తమ కథలు