Home /News /jobs /

China University: వివాదంలో చైనా యూనివర్సిటీ... అడ్మిషన్ల కోసం అభ్యంతరకరమైన యాడ్

China University: వివాదంలో చైనా యూనివర్సిటీ... అడ్మిషన్ల కోసం అభ్యంతరకరమైన యాడ్

China University: వివాదంలో చైనా యూనివర్సిటీ... అడ్మిషన్ల కోసం అభ్యంతరకరమైన యాడ్
(Photo Credit- Weibo)

China University: వివాదంలో చైనా యూనివర్సిటీ... అడ్మిషన్ల కోసం అభ్యంతరకరమైన యాడ్ (Photo Credit- Weibo)

China University | కాలేజీలో అడ్మిషన్ల కోసం చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ ఇచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది.

చైనాకు చెందిన ఒక ప్రముఖ యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. వచ్చే విద్యా సంవత్సరం కోసం అప్లికేషన్లను ఆహ్వానించడానికి సంస్థ ఇచ్చిన ఆన్‌లైన్ ప్రకటన వివాదాస్పదమైంది. ఆ ఎడ్వటైజ్‌మెంట్‌ లైంగిక పరమైన ఆకర్షణను ప్రతిబింబించేలా ఉండటమే ఇందుకు కారణం. చైనాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన నాన్జింగ్ యూనివర్సిటీ (NJU), సోమవారం వెబో ప్లాట్‌ఫాంలో ఈ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. ఇందులో ప్రస్తుత విద్యార్థులు క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల ముందు ప్లకార్డులను పట్టుకున్న ఆరు ఫోటోలు ఉన్నాయి. వీటిలో ఇద్దరు యువతుల చేతుల్లోని ప్లకార్డుల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి.

ఎక్కువ అప్లికేషన్లను పొందేందుకు నాన్జింగ్ యూనివర్సిటీ కొందరు కాలేజీ యువతులతో ప్లకార్డులు పట్టుకొని ఉన్న కొన్ని ఫోటోలను యాడ్‌లో చూపించింది. వీటిలో రెండు ఫోటోలు విమర్శలకు కేంద్రంగా మారాయి. ఒక అందమైన యువతి పట్టుకొని ఉన్న ప్లకార్డుపై.. ‘మీరు ఉదయం నుంచి రాత్రి వరకు నాతో లైబ్రరీలో గడపాలనుకుంటున్నారా?’ అని రాసి ఉంది. మరో యువతి పట్టుకున్న ప్లకార్డుపై.. ‘మీ యవ్వనంలో నేను కూడా భాగం కావాలని కోరుకుంటున్నారా?’ అని రాసి ఉంది. మిగతా ఫోటోల్లో కొందరు యువకులు ప్లకార్డులను పట్టుకున్నట్లు చూపించారు. అయితే వాటిలో ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం.

Deutsche Bank: ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్న జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం

IBPS RRB Jobs 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

చైనాలో ఏటా జాతీయ స్థాయిలో జరిగే కళాశాల ప్రవేశ పరీక్షల మొదటి రోజే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఎంట్రన్స్ టెస్టును చైనా వ్యాప్తంగా ‘గాయోకావో’ పేరుతో నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్ష సందర్భంగా విద్యార్థులను ఆకర్షించడానికి నాన్జింగ్ యూనివర్సిటీ వీబోలో యాడ్‌ను పోస్ట్ చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఇలాంటి లైంగిక దృక్పథం ఉన్న ప్రకటనలు ఇవ్వడం ఏంటని యూనివర్సిటీపై పలువురు నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ ప్రకటన మహిళలను చులకన చేసేలా ఉందని కొన్ని ఎన్జీవోలు సైతం విమర్శిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఇది వైరల్ కావడంతో పాటు వివాదాస్పదమైంది. దీంతో యాడ్‌లో చూపించిన ఫోటోలను సదరు యూనివర్సీటీ తొలగించింది.

చైనాలోని అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీల్లో NJU ఒకటి. క్వాక్వరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2021లో.. ఈ సంస్థ ప్రపంచంలో 124వ స్థానం దక్కించుకోవడం విశేషం. తాజా వివాదం నేపథ్యంలో.. పేరు, ప్రఖ్యాతలు ఉన్న ఈ సంస్థ చెత్త అడ్వటైజ్‌మెంట్లు ఇవ్వడం సరికాదని చైనా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అందమైన యువతీ, యువకులను ఎరగా వేసి ఎన్‌జేయూ యూనివర్సిటీ అడ్మిషన్లు పొందాలనుకుంటుందని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం విబోలో ఒక వ్యక్తి కామెంట్ రాశాడు. ఇలా కాకుండా యూనివర్సిటీలో ఉన్న వనరులు, నాణ్యమైన విద్యను ఆన్‌లైన్ యాడ్‌లో ఆదర్శంగా చూపిస్తే బాగుండేదని మరొకరు రాశారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్... ఓ బ్యాడ్ న్యూస్

IBPS RRB Recruitment 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు ఇవే

అయితే కొందరు మాత్రం, ఇలాంటి వాటిపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ప్రకటనను చూపించి లింగ సమానత్వంపై చర్చలు పెట్టాల్సిన అవసరం లేదని ఒక వ్యక్తి రాశారు. ప్రకటనలలో అన్నింటినీ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఇంకొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో చైనా సంస్కృతిలో స్త్రీలను చులకన చేసి చూడటం బాధాకరమని ప్రకటించింది చెంగ్యూసన్ అనే ఎన్జీఓ. ఈ సంస్థ దేశంలో లింగ వివక్షపై పోరాడుతోంది. ఆన్‌లైన యాడ్‌ వంటి విషయాలపై అసహనం వ్యక్తం చేసిన మహిళలపై.. ‘అతిగా ప్రవర్తించడం’ అనే ముద్ర వేయడం సరికాదని సంస్థ తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, China, EDUCATION, University

తదుపరి వార్తలు