Free IAS Coaching : ఉచితంగా IAS కోచింగ్ ఇచ్చే టాప్ ఇనిస్టిట్యూట్స్ ఇవే..

Free IAS Coaching | IAS కోచింగ్ అంటే ఖర్చుతో కూడుకున్న పని.. అందరికీ ఇది సాధ్యం కాదు.. కానీ.. ఐఏఎస్ అవ్వాలనుకునేవారి కలని మేం నిజం చేస్తాం.. అది కూడా ఉచితంగా అంటూ కొన్ని ఇనిస్టిట్యూట్స్ వెలిశాయి.. అవేంటంటే..

news18-telugu
Updated: May 12, 2019, 10:15 AM IST
Free IAS Coaching : ఉచితంగా IAS కోచింగ్ ఇచ్చే టాప్ ఇనిస్టిట్యూట్స్ ఇవే..
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
news18-telugu
Updated: May 12, 2019, 10:15 AM IST
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎగ్జామ్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. అంటే ఐఏఎస్ ఎగ్జామ్. ఇందులో రాణించాలంటే నైపుణ్యంతో పాటు.. శిక్షణ కూడా ముఖ్యమే. ఓ రకంగా చెప్పాంటే.. ఈ కోచింగ్ కాస్తా డబ్బుతో కూడుకున్న పని.. ఇలాంటి కోచింగ్‌ని ఫ్రీగా ఇచ్చే టాప్ 5 ఇనిస్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం..

దిక్షాంత్ ఎడ్యుకేషన్ సెంటర్, న్యూఢిల్లీ..
న్యూఢిల్లీలోని దిక్షాంత్ ఎడ్యుకేషన్ సెంటర్.. ఫ్రీగా యూపీఎస్సీ కోచింగ్ ఇస్తోంది. సిటీలోని ముఖర్జీ నగర్ దగ్గర్లో ఉండే ఈ సెంటర్.. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన కోచింగ్ అందిస్తుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు, షెడ్యూల్డ్ క్యాస్ట్(sc), వెనకబడిన తరగతులకు చెందినవారు (obc)లకు వారిని ప్రోత్సహించే విధంగా కోచింగ్ ఇస్తోంది ఈ ఇనిస్టిట్యూట్.

జమియా మిల్లీయా ఇస్లామియా, న్యూఢిల్లీ
న్యూఢిల్లీలోని జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఉచిత ఐఏఎస్ కోచింగ్ ఇస్తోంది. రెసిడెన్షియల్ లోని కోచింగ్ సెంటర్ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకి ఉచితంగా శిక్షణనిస్తోంది. అయితే..ఈ కోచింగ్‌లో చేరాలంటే ముందుగా యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.



స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెరీర్స్(SIAC), ముంబై
ముంబైలోని ది స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెరీర్స్(SIAC) యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ అందిస్తోంది అభ్యర్థులకి.. 1976లో మహారాష్ట్ర ప్రభుత్వ హాయంలో ఈ ఇనిస్టిట్యూట్ స్థాపించబడింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎదురుగా హజైమల్ సోమన్ మార్గ్‌లో ఈ ఇనిస్టిట్యూట్ ఉంటుంది. ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ద్వారా యూపీఎస్సీ ట్రైనింగ్ ఇస్తోంది ఈ ఇనిస్టిట్యూట్.
Loading...
ఆలిండియా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌ , తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వ ఆలిండియా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌ని ఐఏఎస్ కోచింగ్ ఇస్తోంది. ఐఏఎస్ కోచింగ్‌కి చెన్నై బెస్ట్ అని చెప్పొచ్చు. చెన్నైలోని రాజఅన్నమలైపురంలోని ఈ ఆలిండియా సివిల్స్ సర్వీససెస్ కోచింగ్సెంటర్.. ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు పర్సనాలిటీ టెస్ట్ కూడా అందిస్తోంది. అభ్యర్థులకి హస్టల్ వసతి కూడా ఉంటుంది. అయితే.. ఈ కోచింగ్ చేరాలంటే ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే.

మనిధా నాయీమ్ ఐఏఎస్ అకాడమీ, చెన్నై..
చెన్నైలోని మనిధా నాయీమ్ ఐఏఎస్ అకాడమీ కూడా ఐఏఎస్ కోచింగ్ అందిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సయిదాయి దురైస్వామి అకాడమీని చెన్నై సీఐటీ నగర్‌లో ప్రారంభించారు. ఐఏఎస్ కోచింగ్‌కి వెళ్లే అభ్యర్థులకి ఉచిత శిక్షణ, గైడెన్స్, స్టడీ మెటిరీయల్ అందించడం ఈ ఇనిస్టిట్యూట్ ప్రత్యేకత.
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...