హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Freshers Hiring: ఫ్రెషర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఆ సంస్థల్లో 1.6 లక్షల నియామకాలు.. వివరాలివే..

IT Freshers Hiring: ఫ్రెషర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఆ సంస్థల్లో 1.6 లక్షల నియామకాలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం చూస్తున్నవారి నిరీక్షణ ఫలించనుంది. ఎందుకంటే దేశంలో టాప్ ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది భారీ నియామకాలు చేయపట్టనున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్ లాంటి దిగ్గజ టెక్ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.6 లక్షల నియమాకాలను చేపట్టనున్నాయి.

ఇంకా చదవండి ...

మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం చూస్తున్నవారి నిరీక్షణ ఫలించనుంది. ఎందుకంటే దేశంలో టాప్ ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది భారీ నియామకాలు చేయపట్టనున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్ లాంటి దిగ్గజ టెక్ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.6 లక్షల నియమాకాలను చేపట్టనున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించి తమ నియామక లక్ష్యాలను రెట్టింపు చేశాయి. మహమ్మారి వల్ల వెనుకంజ వేసిన డిజిటల్ ట్రాన్ఫార్మేషన్ కు ఊతమిచ్చే దిశగా అడుగులు వేయనున్నాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు ఐటీ కంపెనీలు 82 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.

Indian Railway Jobs: పది పాసైన అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..


సెప్టెంబరు 2021 త్రైమాసికానికి 53,964 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. కరోనా కారణంగా గతేడాదికేవలం 17,076 మందికే అవకాశాలు లభించాయి. అయితే, ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు జరపాలని ఎంఎన్​సీ కంపెనీలు యోచిస్తున్నాయి.గతేడాది డిజిటల్ ట్రాన్ఫార్మేషన్ దిశగా ప్రపంచ దేశాలు అడుగుల వేయడంతో సాంకేతికత నూతన పుంతలు తొక్కింది. టెక్నాలజీ ఇకపై ఖర్చుతోనే కాకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఉపకరించాలని తలంచాయి.

పెరుగుతున్న డిమాండ్..

విమానయానం, ఆతిథ్య రంగాలు మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆంక్షలు తొలగిస్తున్నందున కాంటాక్స్ లెస్ చెక్ ఇన్ సదుపాయాలపై పెట్టుబడులు అధికమవుతున్నాయి. రిటైలర్లు కూడా ఇకపై ఆఫ్ లైన్​లో కొనసాగలేరు. బిజినెస్ కోసం వారు కూడా ఐటీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంత బలమైన డిమాండ్ దశాబ్దానికి ఓ సారి మాత్రమే వచ్చే అవకాశమని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.

దశలవారీగా తమ దృక్పథాన్ని మార్చుకొని రెండంకెల వృద్ధి కోసం చూస్తున్నాయి.ముఖ్యంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యురిటీ, స్టాక్ డెవలప్మెంట్, AI/ML నైపుణ్యం లాంటి స్కిల్స్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందుకోసం వీటిలో ప్రతిభ కలిగిన ఐటీ నిపుణుల కోసం సంస్థలు నియామకాలను పెంచుతున్నాయి.

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..


ఉద్యోగుల కోత, ఫ్రెషర్ల కోసం వెతుకులాట..

టీసీఎస్ గత త్రైమాసికాల్లో ఛర్న్ రేట్(churn rate) 8.6 శాతం నుంచి 11.6 శాతం పెరుగుదల చూసింది. విప్రో, ఇన్ఫోసిస్ 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయగా.. HCL టెక్ 15.7 శాతం పెరుగుదలను చూసింది. అంతకుముందు త్రైమాసికంలో ఈ మూడు ఐటీ కంపెనీలు 10 నుంచి 15 శాతం క్షీణతను చవిచూశాయి. ఇదే సమయంలో ఈ సంస్థలు ఉన్న ఉద్యోగులను తొలగించి ఫ్రెషర్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు వచ్చే రెండు, మూడు త్రైమాసికాల వరకు కొనసాగుతుందని టీసీఎస్ హెచ్ఆర్ ఛీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి..


ఈ లోటును పూడ్చటానికి ఫ్రెషర్స్ ను నియమించుకోనున్నట్లు విప్రో సీఈఓ, ఎండీ థియర్రే డెలాపోర్టే అన్నారు. వచ్చే ఏడాది 25వేల మంది ఫ్రేషర్స్ ను రిక్రూట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.టీసీఎస్ కూడా ఈ సంవత్సరం 40 వేల నియామకాలను చేపట్టాలని మొదట్లో భావించింది. అయితే అనంతరం ఆ సంఖ్యను 78 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే 43 వేల మందిని తీసుకుంది. విప్రో కూడా 17 వేల నుంచి 45 వేలకు పెంచాలని నిర్దేశించింది. హెచ్ సీఎల్ 22 వేల మందిని రిక్రూట్ చేయాలని, రెండో త్రైమాసికానికి 11 వేల 135 మందిని తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు..

ఐటీ సంస్థలు నాణ్యమైన, ప్రతిభ కలిగిన వారిని నిలుపుకోవడానికి, ఆకర్షించడానికి అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నాయి. విప్రో, హెచ్ సీఎల్ టెక్ ఉద్యోగుల జీతాలను జులై 1 నుంచి పెంచాయి. టీసీఎస్ ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపును అమలు చేస్తున్నాయి. హెచ్ సీఎల్ సంస్థ అయితే రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్(RSU) నిధులను కూడా ఆమోదించింది. దీర్ఘాకాలిక ఇన్సెంటీవ్ ప్లాన్ లో భాగంగా ఉద్యోగుల ముందుకు ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ మోడల్ కింద ఈ కంపెనీ 100 శాతం నగదు పురస్కారాల నుంచి 70 శాతం నగదు, 30 శాతం RSUగా మారుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచి షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Software, Software developer

ఉత్తమ కథలు