హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Education-Jobs News: టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీలు.. పదో తరగతి హాల్ టికెట్స్.. నేటి విద్యా, ఉద్యోగ సమాచారం ఇలా..

Education-Jobs News: టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీలు.. పదో తరగతి హాల్ టికెట్స్.. నేటి విద్యా, ఉద్యోగ సమాచారం ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు.. యూజీసీ నెట్ ప్రాథమిక కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఇలాంటి నేటి విద్యా, ఉద్యోగ సమాచారం మీ కోసం..

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు.. యూజీసీ నెట్ ప్రాథమిక కీని ఎన్టీఏ(NTA) విడుదల చేసింది. ఇలాంటి నేటి విద్యా, ఉద్యోగ సమాచారం మీ కోసం..

1. పదో తరగతి హాల్ టికెట్స్ విడుదల..

తెలంగాణ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ హాల్ టికెట్ పై హెచ్ఎం సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఫీజుల కోసం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు గతంలో హాల్ టికెట్లను ఇవ్వకుండా విద్యార్థులును వేధించేవారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ స్కూళ్లకు సంబంధం లేకుండా.. నేరుగా ఆన్లైన్లోనే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది.

2. UGC NET ప్రాథమిక కీ విడుదల..

UGC NET పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి సమాధాన కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inసందర్శించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. UGC NET డిసెంబర్ 2022 సైకిల్ (ఫేజ్ I-IV) పరీక్షలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 16, 2023 వరకు నిర్వహించారు. అనేక షిఫ్టులలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inకి వెళ్లి చెక్ చేసుకోవవచ్చు.

3. హైకోర్టు హాల్ టికెట్స్..

జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్టు(High Court).. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 05 వరకు పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కొరకు అభ్యర్థులు ఈ లింక్ ను ఉపయోగించవచ్చు.

Central Scheme: గుడ్ న్యూస్.. విద్యార్థులకు రూ.10 లక్షలు ఇస్తున్న కేంద్ర పథకం..

4. TSPSC ఎగ్జామ్ డేట్స్..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కు సంబంధించిన పేపర్లు లీక్ కావడంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. ఎప్పుడు ఏ పరీక్ష ఉంటుందో తెలియని గందరగోళంగా మారింది. ఇందుకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో, ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించింది. లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్​ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సబంధించిన కొత్త తేదీల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ పరీక్షల తేదీలను ప్రకటించానలి భావిస్తోంది. మే నెలలో ఆ పరీక్షలను నిర్వహించాని కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

First published:

Tags: Career and Courses, JOBS

ఉత్తమ కథలు