Home /News /jobs /

TO QUALIFY SI PRELIMS EXAM IN TELANGANA STATE STUDY AS MENTIONED HERE SIMPLE WILL QUALIFY KNR VB

SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రిపేర్ అయితే అర్హత సాధించొచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎస్ ఐ ప్రిలిమ్స్ లో క్వాలిఫై టిప్స్..

  (P. Srinivas, News 18, Karimnagar) 

  వచ్చే నెలలో ఆగష్టు 7వ తారీఖున ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్(SI Prelims Exams) జరగనున్నది. ఎస్ ఐ కొలువు కొట్టాలనే కోరిక ఉంటే సరిపోదు .. దాని కోసం శ్రద్ధతో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. ఎస్ఐ కొలువు సాధించాలంటే మొదట ప్రిలిమ్స్ ఉంటుంది . తర్వాత ఫిజికల్ టెస్టు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటాయి . అయితే ఈసారి ఎస్ఐ ఉద్యోగాలకు దాదాపు 5లక్షల మంది అప్లై చేసుకున్నట్లు ts పోలీస్ రిక్రూమెంట్ బోర్డు(Police Recruitment Board) తెలిపింది. గతంతో కంటే .. ప్రస్తుత నోటిఫికేషన్(Notification) లో చాలా మార్పులు చేశారు . దానికి అనుగుణంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి .. ఎస్ ఐ ఉద్యోగ కల నెరవేరాలంటే ఎం చేయాలి అనే విషయాలపై విన్నర్ పబ్లికేషన్స్ రైటర్ అండ్స్ నియర్ ఫ్యాకల్టీ సాయి కృష్ణ అభ్యర్థులకు పలు సూచనలు , సలహాలు ఇస్తున్నారు..
  అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

  Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


  చాలా మంది ఎస్ఐ పోస్టులకు ఈ సారి పోటీపడుతున్నారు. అయితే కొంతమంది కోచింగ్ తీసుకుంటే.. ఉద్యోగం వస్తుంది అనుకుంటారు.. కానీ అక్కడే పప్పులో కలిసేనట్లు. దరఖాస్తు చేసినంత ఈజీగా జాబ్ రాదు .. అది కేవలం ఎంత ప్రిపరేషన్ చేస్తున్నామన్నదానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఏ విధంగా చదవాలి .. ఏ విధంగా గుర్తుంచుకోవాలి .. ఏ పాయింట్స్ మనకు ముఖ్యంగా ఎగ్జామ్ లో వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలన్నారు . చాలా మంది విద్యార్థులు లైబ్రరీలో కానివ్వండి .. ఫ్రీ కోచింగ్ కానివ్వండి .. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో కానీ కోచింగ్ కి ప్రిపేర్ అవుతున్నారు .. మరికొంత మంది విద్యార్థులు ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపరేషన్ చేస్తున్నార .

  ఇంకా 12రోజులోనే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నది కాబ్బటి చాలా జాగ్రత్తగా చదవాలిసిన అవసరం ఎంతగానో ఉంది.. ఇప్పుడు ప్రతి సబ్జెక్టు రెండు రోజులు కేటాయించి.. రివైస్డ్ చేసుకోవాలి తప్ప బుక్స్ తో కుస్తీలు పట్టకూడదు. ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ను తీసుకొచ్చారు . ప్రతీ 5 ప్రశ్నలను తప్పుగా గుర్తిస్తే .. ఒక మార్కును కట్ చేస్తారు . కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నెగిటివ్ మార్కింగ్ ను దృష్టిలో పెట్టుకొని చదవాలి . గతంలో నెగిటివ్ మార్కింగ్ అనేది సెంట్రల్ జాబ్స్ కు మాత్రమే ఉండేది .. ఈసారి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకు రావడం జరిగింది . కాబట్టి ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావాలంటే 60 మార్కులు రావాలి .  సబ్జెక్ట్ ల వారీగా మార్కులు ఇలా..
  సబ్జెక్ట్ వైస్ గా ప్రిలిమ్స్ లో ఎన్ని మార్కులు ఉన్నాయో చూద్దాం.. అర్థమెటిక్ రీసనింగ్ కలిపి 100 మార్కులు ఉంటాయి.. మిగతా 100 మార్కులకు జీఎస్ అంటే జనరల్ స్టడీస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ , బయాలజీ , సైన్స్ , సోషల్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి . తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సిలబస్ ను చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్ .. రీజనింగ్ కి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి .. మిగతా జనరల్ స్టడీస్ కు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి . మనకి ఈ రెండు వందలకు 60 మార్కులు వస్తే మనము ప్రిలిమ్స్ లో క్వాలిఫై ఐనట్టు.. లేకపోతేఅభ్యర్థులు ఆ ప్రయత్నం ను విరమించుకోవాలిసిందే..

  Ather 450X Gen 3: కొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450X Gen 3 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146కి.మీ వెళ్లొచ్చు..


  టైమ్ సెన్స్ చాల అవసరం..
  ముందుగా ఎగ్జామ్స్ సెంటర్ లో ప్రశ్నాపత్రం ఇవ్వగానే ఒకటికి రెండు సార్లు ప్రశ్నాపత్రాన్ని చదవాలి .. చదివిన తర్వాత ఫస్ట్ వన్ హౌర్ లోనే తెలిసిన వాటన్నింటికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్లాలి . తెలియని ప్రశ్నలకు వదిలి పెట్టాలి. తెలియని వాటిని అసలే ముట్టుకోవద్దు. మరో వన్ హౌర్ లో కొంచెం తెలిసిన వాటిని గుర్తించి ఆన్సర్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా డేంజర్ . అందుకే పక్కా కరెక్ట్ అని అనుకున్న ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గర్తించాల్సి ఉంటుంది . లాస్ట్ గంటలో తెలియని వాటిని గుర్తు తెచ్చుకొని రాస్తే ఈజీగా .. టైం సరిపోతుంది.. అలా టైం మెయింటైన్ చేస్తే అనుకున్న వాటికంటే ఎక్కువగా స్కోరు చేయవచ్చు అంటున్నారు అల్లము సాయి కృష్ణ సార్.
  Published by:Veera Babu
  First published:

  Tags: Career and Courses, JOBS, Preparation, Telangana jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు