(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
ఎస్ఐ(Sub Inspector) కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగినట్టుగా సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఎస్ఐ కొలువు సాధించాలంటే మొదట ప్రిలిమ్స్(Prelims) ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్టు క్వాలిఫై(Physical Test) అయిన తర్వాత మెయిన్స్(Mains) ఉంటాయి. అయితే గతంతో కంటే.. ప్రస్తుత నోటిఫికేషన్ లో చాలా మార్పులు చేశారు. దానికి అనుగుణంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఎస్ ఐ ఉద్యోగ కల నెరవేరాలంటే ఎం చేయాలి అనే విషయాలపై ఐ 5 కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రవివర్మ అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ 2022 లో ఎస్ఐ , కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మంది విద్యార్థులు లక్షల్లో దరఖాస్తు చేయడం జరిగింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తో కానిస్టేబుల్ , ఎస్ఐకు డిగ్రీ క్వాలిఫికేషన్ తో దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తు చేసినంత ఈజీగా జాబ్ వస్తుంది అని నేను అనుకోవడం లేదు.. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని రవివర్మ అన్నారు. ఏ విధంగా చదవాలి.. ఏ విధంగా గుర్తుంచుకోవాలి.. ఏ పాయింట్స్ మనకు ముఖ్యంగా ఎగ్జామ్ లో వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలన్నారు. చాలా మంది విద్యార్థులు లైబ్రరీలో కానివ్వండి.. ఫ్రీ కోచింగ్ కానివ్వండి.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో కానీ కోచింగ్ కి ప్రిపేర్ అవుతున్నారు.. మరికొంత మంది విద్యార్థులు వితౌట్ కోచింగ్ తో ప్రిపేర్ అవుతున్నారు.. టెక్నిక్స్ తెలుసుకుంటే ప్రీలిమ్స్ లో క్వాలిఫై కావచ్చు.
ప్రిలిమ్స్ , మెయిన్స్ అయనే రెండు స్టేజ్ లల్ల్ ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించాలి. ఇందు ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ను తీసుకొచ్చారు. ప్రతీ 5 ప్రశ్నలను తప్పుగా గుర్తిస్తే.. ఒక మార్కును కట్ చేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నెగిటివ్ మార్కింగ్ ను దృష్టిలో పెట్టుకొని.. ప్రపరేషన్ కొనసాగించాలి. పరీక్షలో చాలా మంది ఏదో గుడ్డిగా ఒకటి పెట్టేసి రాసేయ్యోచు అనే ఉద్దేశంతో ఉంటారు. ఈసారి నెగిటివ్ మార్కింగ్ ఉంది.. గతంలో నెగిటివ్ మార్కింగ్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ కి ఉండేది.. ఈసారి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకు రావడం జరిగింది.. కాబట్టి ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావాలంటే 60 మార్కులు రావాలి.. అది ఎస్ సి, ఎస్ టి, బిసి ఎవరైనా కావచ్చు 60 మార్కులు వస్తేనే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినట్టు . 60 మార్కులు మనం ఎస్సై ఎగ్జామ్ లో ఎలా సాధించాలి అనేది మేజర్ పాయింట్. దీనిని ఎలా సాధించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
అర్థమెటిక్ నుండి మనకి ఒక 50 ప్రశ్నలు వస్తాయి. అంటే అర్థమెటిక్.. రీజనింగ్ కలిపి మనకి మొత్తంగా హండ్రెడ్ ప్రశ్నలు వస్తాయి. మిగతా 100 మార్కులకు జి ఎస్ అంటే జనరల్ స్టడీస్ పార్ట్ లో ఓవరాల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ , బయాలజీ , సైన్స్ , సోషల్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ కాపీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్.. రీజనింగ్ కి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి.. మిగతా జనరల్ స్టడీస్ కు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి.. మనకి ఈ రెండు వందలు మార్కు లో నుండి 60 మార్కులు కావాలి సో.. మనకి ఈ రెండు వందల మార్కులు లో 60 మార్కులు రావాలంటే ఏదో ఒకటి పెట్టి సాధించే అవకాశం ఉందా.. అంటే ఈసారి మాత్రం ఆ అవకాశం లేదు.. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గ్రహించాలి.
ఎందుకంటే ఈ అరవై మార్కులు సాధించాలనే ప్రాసెస్లో నెగిటివ్ మార్కింగ్ అయ్యే చాన్స్ కూడా ఉంటాయి.. ఉదాహరణకు 80 మార్కులకు చదువుకున్నారు.. మనం క్వాలిఫై అవుతాం లే అని చెప్పేసి మిగతా 120 మార్కులు ఏదో ఒకటి గెస్ చేయొచ్చు అని ఆలోచించినా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.. క్వాలిఫై అయ్యేటువంటి ఒక స్టూడెంట్ ఎక్కువగా తప్పులు చేస్తే డిస్ క్వాలిఫై అయ్యే ఆవకాశం ఉంది.. మనకి సైన్స్ లో నుండి 15 మార్కులు.. కరెంట్ అఫైర్స్ లో నుండి 15 మార్కులు, జాగ్రఫీ నుండి 15 మార్కులు ... పాలిటీ అండ్ ఎకనామిక్స్ 15 మార్కులు.. తెలంగాణ హిస్టరీ మూమెంట్ .. ఇండియన్ హిస్టరీ వీటినుండి ఒక 25 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఈ నెగటివ్ మార్కింగ్ ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలలు నేర్చుకున్న కోచింగ్ అంతా మూడు గంటల్లో మీరు ప్రజెంట్ చేయాలి.. మూడు గంటల్లో ప్రజెంటేషన్ చేయాలి.. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయాలని సూచించారు.
TSPSC Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్సీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల
మూడు గంటల్లో మీరు 200 మార్కులు అటెంమ్ట్ చేయాలి.. అంటే ప్రతి ప్రశ్నని ఒకసారి చదవాలి.. చదివిన తర్వాత ఫస్ట్ రౌండ్ లోనే తెలిసిన వాటన్నింటికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్లాలి. తెలియని ప్రశ్నలకు పైన రౌండప్ చేయాలి.. తెలియని వాటి జోలికి వెళ్ళవద్దు.. నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా డేంజర్. అందుకే పక్కా కరెక్ట్ అని అనుకున్న ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గర్తించాల్సి ఉంటుంది. ఏం కాదులే అని ఆలోచించి నిర్లక్ష్యంగా ఉండి ఆన్సర్ చేయవద్దు. కాని రిజల్ట్ వచ్చిన తర్వాత స్కోర్ చూసుకుంటే క్వాలిఫై కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
AP Mega Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..
కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 60 మార్కులు వచ్చిన అభ్యర్థి క్వాలిఫై అవుతారు. తర్వాత వాళ్లకు ఈవెంట్స్ లేదా ఫిజికల్ ఎక్ససైజ్ టెస్ట్ కి పిలుస్తారు. కాబట్టి జాగ్రత్త పడకుండా ఎగ్జామ్ టైమింగ్ మెయింటెన్ చేయకపోతే గనుక ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు పైన చెప్పిన విధంగా జాగ్రత్త పడాలని సూచించారు. ముఖ్యంగా ఎక్కువ మార్కులు వస్తాయి కదా అని తెలియని వాటిని ఆన్సర్ చేయకండి.. వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. 60 మార్కులు వస్తే సరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Si prelims, Sub inspector, Telangana