Home /News /jobs /

TO DAY NEET EXAM NEW GUIDLINE FOR STUDENTS MUST CAREFULL EVERY STUDENT HERE IS FULL DETAILS NGS

NEET Exam: నేడు నీట్‌ ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. కొత్త గైడ్​లైన్స్ ఇవే.. విద్యార్థులకు అలర్ట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Neet Exam: దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షల్లో స్వల్ప మార్పులు.. చేశారు. మరోవైపు ఈ పరీక్షకు హాజర్యే విద్యార్థులంతా ఈ విషయాలను తప్పక పాటించాల్సి ఉంది.

  NEET UG 2021: నేడు మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం జరిగే నీట్(యూజీ) ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఆఫ్‌లైన్‌లో జరుగనున్న నీట్‌ ఎగ్జామ్ కు దాదాపు 16 లక్షల మంది పోటీపడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే నీట్ మూడు గంటల పాటు జరగనుంది. గత ఏడాది 15.97 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా 13 లక్షల మంది పరీక్ష రాశారు. ఈసారి దేశవ్యాప్తంగా 202 నగరాల్లో మొత్తం 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొత్తం 112 కేంద్రాల్లో నీట్‌ జరుగనుండగా.. ఏపీలో 151 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాత విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే.. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కఠిన నిబంధనలు విధించింది.

  నీట్​ పరీక్ష ఈ సారి 11 ప్రాంతీయ భాషల్లో (Regional languages) జరగనుంది. కాగా, పరీక్ష హాల్లోకి  (Hall) తీసుకురావాల్సిన సామగ్రి (Items) గురించి National testing Agency నియమ, నిబంధనలు తెలిపింది. అభ్యర్థులకు పరీక్ష హాలు వెలుపలే థర్మల్​ స్ర్కీనింగ్​ చేయనున్నారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్‌ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టంచేసింది. పరీక్ష ఆఫ్ లైన్ విధానంలోనే జరుగుతోంది. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా గైడ్ లైన్స్ పాటించాలని అధికారులు సూచించారు. మాస్క్ తప్పని సరి ధరించాలని తెలిపారు. షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవద్దని తెలిపారు.

  ఇదీ చదవండి: వార ఫలాలు.. అన్ని విధాలా కలిసివచ్చే కాలం.. కొత్త పరిచయాలతో లాభం

  ఈసారి నీట్ లో స్వల్ప మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇవ్వనుంది. ఈ సారి నీట్ ఎగ్జామ్‌లో ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనంగా ఇవ్వనున్నారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలిచ్చేవారు. అన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉండేది. కానీ, ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నల చొప్పున కలిపారు. ఒక్కో సబ్జెక్టులో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలిస్తారు. వాటిలో జవాబులు రాయాల్సింది. 180 ప్రశ్నలకు మాత్రమే. సమయం మూడు గంటలే ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ‘ఎ’ సెక్షన్‌లో 35 ప్రశ్నలుంటాయి. అన్నీ రాయాలి. ‘బి’ సెక్షన్‌లోని 15 ప్రశ్నల్లో 10 రాయాలి.

  ఇదీ చదవండి: గుజరాత్ కు కాబోయే సీఎం ఎవరు.. రేసులో ఆ నలుగురు.. మోదీ మదిలో ఏముంది?

  వృక్ష, జంతుశాస్త్రాల్లో జ్ఞాపకశక్తి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలు 60 శాతానికి పైగా ఉంటాయి. డయాగ్రామ్స్ ఆధారంగా ఇచ్చే అంశాలు.. కణ విభజన (సెల్‌ డివిజన్‌), వాటి దశలు, ఫ్లో ఛార్టులు, మొక్కల్లో చీడలు, క్రిమికీటకాల వంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈసారి 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించారు. నీట్‌లో ర్యాంకును నిర్ణయించేది భౌతికశాస్త్రమే. ఎక్కువ మంది కష్టంగా భావించేదీ కూడా ఈ భౌతిక శాస్త్రాన్నే. ఇంటర్‌ సెకండ్ ఇయర్ సిలబస్‌ కొంత సులభంగా ఉంటుంది. అందులో ఎక్కువ స్కోర్‌కు అవకాశం ఉంది. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఆర్డర్స్‌ సంబంధిత అంశాలు, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములేషన్లు, యూనిట్లు, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్డ్‌ రియాక్షన్లు, రీఏజెంట్లను రివిజన్‌ చేసుకోవాలి. సంబంధిత గ్రాఫ్స్‌ (పట్టిక) పరిశీలించాలి. తప్పు, ఒప్పు తరహా ప్రశ్నల్లో గందరగోళం పడకుండా, వాటిని బాగా అర్థ చేసుకోవాలి.

  ఇక పరీక్షకు హాజర్యే విద్యార్థులు ఈ నిబంధనలు మరచిపోవద్దు..

  1.  నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు (Students) లేత దుస్తులు (light clothes with half sleeves) మాత్రమే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి వారు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి.

  2. . అభ్యర్థులు బూట్లు(Shoes) వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్‌ ఉండే శాండిల్స్‌ మాత్రమే వేసుకుని రావాలి.

  3 వ్యాలెట్‌ (wallet), పౌచ్‌, గాగుల్స్‌, టోపీలు, హ్యాండ్‌ బ్యాగులు (hand bags) వంటివి తీసుకురావొద్దు.

  4.  పెన్సిల్‌ బాక్సు, కాలిక్యులేటర్‌ (Calculators), పెన్ను(Pen), స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌ వంటివి కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

  5. మొబైల్‌ ఫోన్‌ (Mobile Phone), బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్స్‌, హెల్త్‌ బ్యాండ్‌, వాచ్‌ (Watch)లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా తమ వెంట  తీసుకురావొద్దు.

  6. చెవిపోగులు (Ear rings), చైన్లు (Chains), ముక్కు పుడక, నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు వేసుకోవద్దు.

  7.  అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిల్లు (water bottles) కూడా తీసుకురావొద్దు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Exam Tips, Exams, NEET, NEET 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు