హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

How to Check 10th Results Andhra Pradesh: నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

How to Check 10th Results Andhra Pradesh: నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

నేడే పది ఫలితాలు విడుదల

నేడే పది ఫలితాలు విడుదల

Andhra Pradesh SSC Results 2022: ఆంధ్రప్రదేశ్ లోని పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికొన్ని గంటల్లో వారి ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇంకా చదవండి ...

Andhra Pradesh SSC Results 2022: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పదో తరగతి పరీక్ష (10th Class Exams) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉంటాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఈ పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎందుకంటే ఏపీలో పదో తరగతి పరీక్షలు.. కరోనా (Corona) పరిస్థితుల కారణంగా.. రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఇంటర్ (Inter) కు ప్రమోట్ అయ్యారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. అయితే అనుకున్న టైం ప్రకారం.. అంటే కేవలం 25 రోజుల్లో.. రికార్డు స్థాయిలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.

BSE AP 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు జరిగాయి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 27-తెలుగు, ఏప్రిల్-28-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29-ఇంగ్లిష్, మే 2-గణితం, మే 4-సైన్స్-4, మే 5-సైన్స్ పేపర్-2, మే 6న సోషల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించారు. గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు.


ఇదీ చదవండి : ఆస్పత్రులకు తప్పని విద్యుత్ కోతలు.. అంధకారంలోనే బ్రాండిక్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స

మరోవైపు ఈ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఎవరైనా గతంలో లా.. ఇష్టం వచ్చినట్టు ర్యాంకులకు సంబంధించి ప్రకటనలు వేస్తే.. జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరి ప్రభుత్వ హెచ్చరికలు కార్పొరేట్ పాఠశాలల ఎంత వరకు పాటిస్తాయో అన్నది కాసేపట్లో తేలనుంది.

ఇదీ చదవండి : అధికార వైసీపీలో అంతర్గ కుమ్ములాటలు.. ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్బంది..?

ఫ‌లితాలు ఎలా చెక్ చేసుకోవాలి..

ప‌దవ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ఇవాళ విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే.. రిజల్ట్ లింక్ ను ఓపెన్ చేయాలి. తరువాత అక్కడ వచ్చే బ్లాంక్ బాక్స్ లో హాల్ టికెట్ ఎంటర్ చేసి.. ఫలితాలు తెలుసుకోవచ్చు.

First published:

Tags: 10th class results, Andhra Pradesh, AP 10th Class Exam 2019 Results, AP News

ఉత్తమ కథలు