Janananna Vidya Kanuka: జగనన్న విద్యా కానుకలో ఇచ్చేవి ఇవే.. దీనికి కోసం 731 కోట్ల ఖర్చు

జగనన్న విద్యాకానుక (ఫైల్ ఫొటోలు)

పేద విద్యార్థులకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు సీఎం జగన్.. ఇప్పటికే విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు విద్యాకానుక రెండో విడతకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ విద్యా కానుకలో ఇచ్చే వస్తువులు ఏంటో తెలుసా..?

  • Share this:
    కరోనా కష్టకాలం, రాష్ట్ర ఆర్థిక సమస్యలు.. వీటికి తోడు కేంద్రం నుంచి ఏ మాత్రం సహాకారం లభించడం లేదని ఆరోపణలు.. అయినా సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాలు అమలులో  తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా చెప్పిన విధంగా వారికి నగదు అందచేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక ప్రవేశ పెట్టారు సీఎం జగన్. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు ఇస్తున్నారు. విద్యాకానుక రెండో విడత పంపిణీని సీఎం జగన్  స్వయంగా చేస్తుండడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్.. నాడు-నేడు పథకాన్ని పి. గన్నవరంలో ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యాకానుక రెండో విడుతను ప్రారంభించనున్నారు. సీఎంయే స్వయంగా విద్యార్థులకు ఈ విద్యాకానుకను అందించనున్నారు. ఈ కానుకను ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రతి పేద విద్యార్థికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలా విద్యార్థులకు అందజేయాలి అన్నదానిపై సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్..

    ఈ విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఇస్తున్నారు. విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్‌ కిట్లలో వస్తువుల నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47.32 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఇవి అందనున్నాయి.

    జగనన్న విద్యా కానుక కోసం 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 731.30 కోట్ల రూపాయల వ్యయం చేస్తోంది. విద్యా కానుక ద్వారా విద్యార్థులకు అందచేసే వస్తువులు 100 శాతం నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎమ్, మండల విద్యాశాఖాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించారు. నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, జత బూట్లు, రెండు జతల సాక్సులను రాష్ట్రంలోని 4 వేల 031 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు, యూనిఫాం క్లాత్‌ను 670 మండల రిసోర్సు కేంద్రాలకు సప్లయర్స్‌ అందజేస్తున్నారు. కిట్లను ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలని ఉన్నతాధికారులు అదేశాలిచ్చారు. జగనన్ విద్యా కానుకలో చిన్నసైజ్ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని కూడా జత చేసి ఇవ్వనున్నారు.
    Published by:Nagesh Paina
    First published: