Home /News /jobs /

TMREIS RECRUITMENT 2020 TELANGANA MINORITIES RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY IS HIRING OVER 1000 JUNIOR LECTURERS IN 71 UPGRADED SCHOOLS SS

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1,000 పైగా ఉద్యోగాలు

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1,000 పైగా ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1,000 పైగా ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

TMREIS Recruitment 2020 | తెలంగాణలోని 71 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ ఏడాది కాలేజీలుగా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ కాలేజీల్లో 1,000 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో జూనియర్ లెక్చరర్లను నియమిస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో 71 స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TMREIS. ఆ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రారంభం కాబోతోంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్ని అందించబోతోంది. అందుకే ప్రతీ కాలేజీలో కనీసం 15 మంది జూనియర్ లెక్చరర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తోంది టీఎంఆర్ఈఐఎస్. 71 కాలేజీల్లో ప్రతీ కళాశాలకు కనీసం 15 చొప్పున అంటే పోస్టుల సంఖ్య 1,000 పైనే ఉంటుందని అంచనా. దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ http://tmreis.telangana.gov.in/ చూడొచ్చు. లేదా స్థానికంగా ఉండే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో మార్కులను బట్టి అభ్యర్థులను 1:2 రేషియోలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి ఫైనల్ లిస్ట్‌ని పంపిస్తారు.

    TMREIS Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం జూనియర్ లెక్చరర్ ఖాళీలు- 1,000 పైనే
    దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 1
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31
    దరఖాస్తుల పరిశీలన- 2020 ఏప్రిల్ 1 నుంచి 15
    రాతపరీక్ష- 2020 ఏప్రిల్ 19
    ఫలితాల విడుదల- 2020 ఏప్రిల్ 30
    ఇంటర్వ్యూలు- 2020 మే 5 నుంచి 20
    సబ్జెక్ట్స్- ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్.
    విద్యార్హత- ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.
    అనుభవం- ఏదైనా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో కనీసం మూడేళ్లు బోధించిన అనుభవం ఉండాలి.
    వయస్సు- 18 నుంచి 44 ఏళ్లు
    ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
    వేతనం- రూ.27,000.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 జాబ్స్... ఖాళీల వివరాలివే

    RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌‌పై క్లారిటీ... లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

    CTET July 2020: గుడ్ న్యూస్... సీటెట్ 2020 గడువు మరోసారి పెంపు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు