హోమ్ /వార్తలు /jobs /

Microsoft Kid: పిల్లోడు కాదు చిచ్చర పిడుగు.. ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ ఆఫీసుతో అద్భుతాలు.. అరుదైన రికార్డు సొంతం

Microsoft Kid: పిల్లోడు కాదు చిచ్చర పిడుగు.. ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ ఆఫీసుతో అద్భుతాలు.. అరుదైన రికార్డు సొంతం

ఆరేళ్లకే అద్భుతాలు

ఆరేళ్లకే అద్భుతాలు

Wonder Kid: పిల్లోడు కాదు పిడుగు అనిపించుకుంటున్నాడు ఆరేళ్ల అనిరుధ్.. ఆన్ లైన్ క్లాస్ లు అంటే ఆమడ దూరంలో ఉండాల్సిన చిన్నారి.. ఇప్పుడు మైక్రోసాప్ట్ ఆఫీసును ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.. అందుకే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు..

GTహేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

Raja Anirudh Sriram: ఆన్ లైన్ క్లాస్  (online classes) లు ముగిసిన వెంటనే.. మొబైల్ (mobile), ట్యాబ్ (Tab) లేదా ల్యాప్ టాప్ (Laptop) లాంటివి పట్టుకుని ఆటలాడుకునే వయసు.. లేదా యూట్యూబ్ (Youtube) కార్టూన్, పిల్లల వీడియోలు చూసే వయసు.. కానీ అరేళ్లకే ఎవరూ ఊహించని ఘనతలు సాధిస్తున్నాడు రాజా అనిరుద్ శ్రీరామ్. చదివేది రెండో తరగతి.. అంటే అప్పుడప్పుడే ఇంగ్లీష్ పదాలు రాయడం.. పూర్తిగా చదవడం నేర్చుకునే వయసు.. కంప్యూటర్ బేసిక్స్ (Computer Basics) తెలుసుకోవడం కూడా కష్టమే.. కానీ అనిరుద్ మాత్రం.. ఆరేళ్ల వయసుకే మైక్రోసాఫ్ట్ స్పెషలిస్టు (Microsoft Specialist) పరీక్ష పాసై అందరిని అబ్బురపరిచాడు.. చిచ్చరపిడుగు అనిపించుకుంటున్నాడు. ఐటీ ప్రొఫెషనల్స్ కు కూడా కష్టమైనదిగా భావించే పరీక్షలో సక్సెస్ అయ్యాడు. ఆరేళ్ల ప్రాయంలోనే కంప్యూటర్ పరిజ్ఞానంతో మిలియన్లలో ఒకడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్  (India Book of Records)ఎక్కాడు. తిరుపతికి చెందిన తల్లిదండ్రులు సాకేత్ రామ్, అంజనా శ్రావణిల కుమారుడే అనిరుధ్.. ప్రస్తుతం Edify స్కూల్లో చదువుతున్నాడు. ఒకవైపు ఆన్ లైన్ క్లాసులు వింటూనే మరోవైపు కంప్యూటర్ ముందు కూర్చొని మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ (Micro soft Excel) ప్రాక్టీస్ చేసి.. వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు.. ఎంతో ప్రాక్టీస్ ఉన్నవారికి సాధ్యం కానిదాన్ని చేసి చూపిస్తున్నాడు..

కరోనా సమయంలో స్కూల్ కు వెళ్లే పరిస్థితి లేదు. అంతా ఆన్ లైన్ లోనే క్లాసులు.. ఇదీ చాలా మంది విద్యార్థులకు విసుగు తెప్పించింది. తల్లి దండ్రులను చిరాకు పెట్టింది. ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో మొబైల్స్ కు తమ పిల్లలు అలవాటు పడుతున్నారని మదనపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ ఆన్ లైన్ క్లాస్ ల సమయాన్ని అనిరుధ్ సద్వినియోగం చేసుకున్నాడు. అందరి పిల్లల్లా ఆడుకోకుండా కంప్యూటర్ ఎక్స్ ఎల్ ఓపెన్ చేసి.. A,B,C,D అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. బాలుడి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్‌లో మెలకువలను నేర్పించారు. ఇంక అంతే.. సూపర్ ఫాస్ట్ గా అన్ని నేర్చేసుకున్నాడు. ఏకంగా మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్పెషలిస్టు పరీక్షకు రెడీ అయ్యాడు.

ఇదీ చదవండి: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు

మొదటి ప్రయత్నంలో ఆగస్టు 14న టెస్టు రాశాడు. అందులో విజయం సాధించలేకపోయాడు. అయినా వెనుకడుగు వేయలేదు. మళ్లీ ప్రయత్నించాడు.. నిరంతర సాధనతో మంచి స్కోరు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్కోరు 1000కి 546 నుంచి 950కి మెరుగుపడింది. రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న మళ్లీ టెస్టు రాసి అందులో పాసయ్యాడు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్పెషలిస్ట్ సర్టిఫికేట్ పొందాడు. తద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. ఆరేళ్లకే ఈ రికార్డు సాధించిన అనిరుధ్.. ఒడిశాకు చెందిన ఏడేళ్ల బాలుడి రికార్డును బ్రేక్ చేశాడు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirupati, Wonderful parents

ఉత్తమ కథలు