Success Tips: ఇలా చేస్తే ఏదైనా సాధించగలరు..

ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. చిత్తశుద్ధి, ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని .. చెడు అలవాట్లు, ఆలోచనలకు దూరంగా ఉండాలి.

Amala Ravula | news18-telugu
Updated: April 8, 2019, 6:55 AM IST
Success Tips: ఇలా చేస్తే ఏదైనా సాధించగలరు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 8, 2019, 6:55 AM IST
కొంతమంది ఉంటారు.. ఎప్పుడు ఏదో చేయాలని అనుకుంటారు.. పూర్తి చేశారా అంటే.. అబ్బే చేసేందుకు టైమ్ ఎక్కడుందని చెబుతుంటారు.. క్షణం తీరిక లేకుండా ఉన్నాం.. చేసేపనులు.. ఇళ్లు చూసుకోవడంతోనే సరిపోతుందంటూ సమాధానాలు చెబుతారు. ఇలాంటి వారు.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.
పరిస్థితులను, వ్యక్తులను నిందించడానికి ముందు తాము ఎక్కడ లోపాలు చేస్తున్నారో గుర్తించాలి.
వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసేందుకు ఉండే సమయం.. సాధించే విషయంలో ఎందుకు ఉండదు.. నిజంగా అంత బిజీగానే ఉంటే... మీరు ఇంకా కొత్తగా సాధించేది ఏం లేదు.. అప్పటికే సాధించారని గుర్తించాలి.


బిజీగా మాత్రం లేకపోతే.. ఒక్కసారి ఆలోచించాలి.. ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. చిత్తశుద్ధి, ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని .. చెడు అలవాట్లు, ఆలోచనలకు దూరంగా ఉండాలి.
ఎంతో పని ఉందని ఆలోచిస్తూ, భయపడుతూ ఉన్నచోటే ఉండేబదులు.. ఉన్నపనిని ఎలా పూర్తిచేయాలని ఆలోచించి పథకం ప్రకారం చేయడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. ఉన్న ప్రపంచంలో ఎవరో రారు.. ఏదో చేయరు.. ఎవరికీ వారే తమ జీవితానికి పూలబాటలు వేసుకోవాలి..
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...