హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Tips To Improve General Knowledge: జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Tips To Improve General Knowledge: జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Tips To Improve General Knowledge: జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Tips To Improve General Knowledge: జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Tips To Improve General Knowledge: ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగం సాధించాలంటే .. రాత నైపుణ్యంతో పాటు.. ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. జనరల్ నాలెడ్జ్ లో మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పర్సనల్ విషయాలతో పాటు.. దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభుత్వ రంగంలోనే(Government Sector) కాదు, ప్రైవేట్ రంగంలో(Private Sector) కూడా మంచి ఉద్యోగం(Job) సాధించాలంటే .. రాత నైపుణ్యంతో పాటు.. ఇంటర్వ్యూ స్కిల్స్(Interview Skills), జనరల్ నాలెడ్జ్ (General Knowledge) అనేది ఉండాలి. జనరల్ నాలెడ్జ్ లో మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పర్సనల్ విషయాలతో పాటు.. దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు(Questions) అడుగుతారు. దీంతో పాటు.. ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ఇది కీలక భాగం. దీనిలో మంచి అవగాహన ఉన్నవాళ్లు రాత పరీక్షలో మంచి మెరిట్(Merit) తెచ్చుకుంటారు. అందుకే జనరల్ నాలెడ్జ్(General Knowledge) అనేది తెలుసకోవడం చాల ముఖ్యం.దాని కోసం ఏం చేయాలి.. ఎలా వాటిని సేకరించాలనే విషయాలను తెలుసుకుందాం..

Career Tips: మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలనుకుంటే.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..


సమయం గడిచే కొద్దీ పోటీ పరీక్షలు కఠినంగా మారుతున్నాయి. ప్రతిరోజూ కొత్త విషయాలు తెరపైకి వస్తాయి. దానిని అప్‌డేట్ చేయకపోతే పోటీ పరీక్షలో విజయం సాధించడం కష్టం. ప్రభుత్వోద్యోగాల్లోనే కష్టమవుతుందని కాదు.. ప్రయివేటు రంగంలో కూడా ఇదే ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని చోట్లా మారింది.

ఈసమయంలో.. రోజువారీ సంఘటనలు, నియామకాల గురించి అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాలను తెలుసుకోవడం అనేది కేవలం టాప్ ర్యాంక్ కోసం పోరాటం మాత్రమే కాదు.. సాధారణ జీవితంలో కూడా ఇది ముఖ్యమైనది. పోటీ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి.. ఏ మాధ్యమాల ద్వారా వీటిని పొందాలో తెలుసుకుందాం..

TSPSC Group 4 Update: గ్రూప్ 4 ఉద్యోగాలపై అప్ డేట్.. ఆ నెలలో నోటిఫికేషన్ విడుదల..!


వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి..

వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకోవడం ద్వారా రోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఖచ్చితమైన సమాచారం కోసం నేటికీ చాలామంది ఈ వార్తా పత్రికలనే విశ్వసిస్తారు. మీరు దీన్ని హార్డ్ కాపీని తీసుకొని కూడా చదవవచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని వార్తాపత్రికలు ఈ-పేపర్ రూపంలో ఇంటర్నెట్‌లో ఉన్నాయి. దీన్ని ప్రతిరోజూ చదవడం ద్వారా.. మీరు GK, నేషనల్-ఇంటర్నేషనల్, బిజినెస్‌తో సహా అన్ని విషయాలపై అవగాహన తెచ్చుకోవచ్చు.

పోటీ పరీక్షలకు ప్రపేర్ అయ్యే వారు.. వార్తా పత్రికలు మాత్రమే చదివితే సరిపోదు. వాటితో పాటు.. ఆయా ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ పేపర్ ను దగ్గర ఉంచుకోవాలి. దాని ప్రకారం సబ్జెక్టుకు సంబంధించి పుస్తకాలను చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కు అనుగుణంగా.. అప్ డేట్ అవుతూ.. సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకోవాలి.

Indian Army Recruitment For Females: పది అర్హతతో.. ఇండియన్ ఆర్మీలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..


టీవీ మరియు ఇంటర్నెట్‌ను సరిగ్గా ఉపయోగించుకోండి..

టీవీ, ఇంటర్నేట్ మాద్యమాల్లో కూడా ప్రపరేషన్ ను కొనగించవచ్చు. మీకు సంబంధిచి భాషలో సమగ్ర సమాచారం లేకపోతే.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. టీవీలో వచ్చే వార్తలు, ప్రోగ్రామ్ ల ద్వారా అదనపు నాలెడ్జ్ ని సంపాదించుకోవచ్చు. మీకు ఏదైనా అర్థం కాకపోతే.. ఇంటర్నెట్‌లో కూడా శోధించవచ్చు.

GDలో పాల్గొనడం ..

గ్రూప్ డిస్కషన్ లో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. ఈ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇలా మాట్లాడటం వల్ల మీలో ఉన్న భయం తొలగిపోతుంది. స్టేజ్ ఫియర్ అనేది తొలగిపోయి.. ఇంటర్వ్యూల్లో మంచి ప్రదర్శనను కనబరుస్తారు. కొత్త విషయాలను విన్న వెంటనే గుర్తుకుంటచుకోవడం కష్టంగా ఉంటుంది. దీని కోసం ఒక నోట్స్ పై రాసుకోవడం మంచిది. దానిని అవసరం అయినప్పుడు చదువుకోవడం ద్వారా ఆ విషయం చాలా కాలం గుర్తుండిపోతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Career guidlines, General knowledge, JOBS

ఉత్తమ కథలు