(P. Mahender, News 18, Nizamabad)
ఎస్సై .. కానిస్టేబుల్ కొసం ప్రిపేర్ అయ్యే నాన్ మాథ్స్ స్టూడెంట్స్(Maths Students) ఇలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చని నిజామాబాద్ ఐ5 కోచింగ్ సెంటర్ ప్యాకల్టీ ఆఫ్ హిస్టరీ భరత్ చెబుతున్నారు.. మాథ్స్(Maths) అంటే భయ పడే విద్యార్థులు(Students) జీ ఎస్ లో కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ పై దృష్టి పెట్టాలి. అయితే ఇండియన్ హిస్టరీ.. తెలంగాణ హిస్టరీ ... తెలంగాణ మూమెంట్ ఇలాంటి వాటి పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది.. అంటే యాబై మార్కులు(Marks) మనం గెయిన్ చేయొచ్చు. ఉదాహరణగా చెప్పాలంటే ఇంచుమించు ఎస్ఐ(SI) కొచ్చే సరికి తెలంగాణ హిస్టరీ నుండి 25 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ నుండి దాదాపు 20 మార్క్స్ వస్తాయి . తెలంగాణ మూమెంట్(Telangana Movement), హిస్టరీ(History) నుండి దాదాపు టెన్ మార్క్స్ వస్తాయి. 50 కి 50 మార్కులు ఇక్కడ కవర్ చేయొచ్చు.
కానిస్టేబుల్ (Constable) విషయానికి వస్తే దాదాపుగా ఇక్కడ కూడా 50 మార్క్స్ తెలంగాణ మూమెంట్ మీద.. తెలంగాణ హిస్టరీ మీద మార్కులువ స్తాయి. వీటిపై ఎక్కువగా గ్రిప్ తెచ్చుకుంటే మార్కులు సాధించవచ్చు. ఇవే మేజర్ సబ్జెక్ట్స్ . ఇవి కేవలం నాన్ మాథ్స్ స్టూడెంట్స్ కి మాత్రమే కాదు అందరికీ ముఖ్యమైన విభాగం. ఇండియన్ హిస్టరీ నుండి ఒక 20 మార్క్స్ నుండి 22 మధ్యలో వస్తాయి. కాబట్టి ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
అలాగే పాలిటీ చూసుకున్నట్లయితే.. పాలిటీ అండ్ ఎకనామిక్స్ రెండు కలిపి కానిస్టేబుల్ లో 20 మార్క్స్ .. అలాగే ఎస్ఐ లో చూసుకున్నట్లయితే ఇందులో నుండి 10 నుంచి 20 మార్కులు వస్తాయి. వీటన్నింటినీ కలిపితే మొత్తం 60 నుండి 65 మార్కులు వస్తాయి. ఎస్ఐ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ క్వశ్చన్స్ చదవడంలో అప్డేటెడ్ అయ్యి చదువుకోవాలి. ప్రీవియస్ లో నుండి చాలా బిట్స్ చూసుకోండి చాలా అప్డేటెడ్ గా క్వశ్చన్స్ అడిగారు. అంటే డైరెక్ట్ బిట్ ఇవ్వడం లేదు.. మాచ్ ది ఫాలోయింగ్ అని ఇస్తున్నారు.. కాబట్టి వాటిని తీసుకోవడానికి ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. గతంలో కంటే ఇప్పుడు మనకు కొన్ని మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. నెగెటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు.. అయితే ఐదు తప్పులకి ఒక మార్కు కట్ అయ్యే ఆవకాశం ఉంది. కాబట్టి చాలా మంది ఏదో గుడ్డిగా ఒకటి పెట్టేసి రాసేయ్యోచు అనే ఉద్దేశంతో ఉండకూడదు. ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే 60 మార్కులు రావాలి.. ఎస్ సి, ఎస్ టి, బిసి ఎవరైనా కావచ్చు 60 మార్కులు వస్తేనే మనం అర్హత సాధించినట్లు.
అర్థమెటిక్.. రీజనింగ్ కలిపి మనకి మొత్తంగా హండ్రెడ్ ప్రశ్నలు ఉన్నాయి. మరో హండ్రెడ్ మార్క్స్ మనకి జి ఎస్ అంటే జనరల్ స్టడీస్ పార్ట్ లో ఓవరాల్గా ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, సోషల్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఎస్ఐకి ఇంగ్లీష్ అనేది లేదు.. ఇందులో ఇంగ్లీష్ అనేది మనకు ఎక్కడా మెన్షన్ చేయలేదు.. కాబట్టి ఇంగ్లీష్ రాకపోవచ్చు. మనకి మొత్తం రెండు వందలు మార్కు లు ఉంటాయి. 60 మార్కులు కావాలి. ఎందుకంటే ఈ అరవై మార్కులు సాధించాలనే ప్రాసెస్లో నెగిటివ్ మార్కింగ్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. జగ్రాత్తగా పక్కాగా తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయాలి. అందుకోసం చదివిన వాటిని రిపీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ లో అర్హత సాధించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Police, Preparation, Telangana