(P. Mahender, News18, Nizamabad)
తెలుగుకు సంబంధించి రెండు రకాల పోస్టులు ఉంటాయి. గ్రేడ్ 1 తెలుగు పండిట్, గ్రేడ్ 2 తెలుగు పండిట్. వీటిని ఇప్పుడు భాష ఉపాధ్యాయుడు అంటున్నారని ZPHS ధర్మారం (బీ) స్కూల్ అసిస్టెంట్(Telugu) డా. దస్తగిరి అన్నారు. స్కూల్ పండిట్(School Pandit) కొలువు సాధించాలంటే ఈ కింద తెలిపిన పుస్తకాలను చదవాలని విద్యార్థులకు సూచించారు. ఇక స్కూల్ ఆసిస్టేంట్, పండిత్ పోస్టులకు ఒకే సిలబస్ ఉంటుంది. పోటీ రీత్యా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. 2017 డీఎస్సీ ప్రకారం తెలుగుకి 80 మార్కులు ఉంటాయి. పర్స్ పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కు(Education) 10 మార్కులు. జనరల్ నాలెడ్జ్ కు 10 మార్కులు కేటాయించారు. కంటెంట్ కి 44 మార్కులు .. మెథడాలజీకి 16 మార్కులు మొత్తం 60 మార్కులు తెలుగులో ఉంటాయి.
గతంలో అంటే 2012 డీఎస్సీ కంటే ముందు ఉన్నటువంటి సెలబస్ 2012 డీఎస్సీ కి చాలా సిలబస్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. కారణం పోటీ పెరగడమే అని తెలిపారు. కాబట్టి తెలుగులో అభ్యాసం చేసే వాళ్ల యొక్క సంఖ్య పెరిగింది. గతంలో కేవలం మూడో తరగతి నుండి పదవ తరగతి పుస్తకాలు చదువుకుంటే కంటెంట్ సరిపోయేది.. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న కొన్ని పుస్తకాలు.. ఏవైతే కవులు రచయితలు పాఠ్యంశాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని సంబంధించిన సాహిత్యచరిత్రను అధ్యయనం చేయాలి. ప్రస్తుత సిలబస్ ప్రకారం కవులు, రచనలు, కావ్యాలు, రచయితలు, ప్రక్రియలు, వివరణ లక్షణాలు, ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణలు అని చెప్పేసి మొదటి మూడు యూనిట్స్ ఉన్నాయి. మొదటి మూడు యూనిట్ కి సంబంధించి మీకు టైం ఉన్నట్లయితే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనే పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి.
వీటిని గనుక అధ్యయనం చేస్తే మొత్తం కవర్ అవుతుందని అన్నారు. ఇంత పెద్ద పుస్తకాలు మేము చదవలేము అని అనుకుంటే నాగయ్య గారు రాసినటువంటి తెలుగు సాహిత్య సమీక్ష రెండు పుస్తకాలు ఉన్నాయి.. వీటిని కూడా అధ్యయనం చేయలేము అన్నటువంటి వారు ద్వానా శాస్త్రి గారు రాసినటువంటి ఒకే పుస్తకం ఉంది.. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి పింగళి లక్ష్మీకాంతం రాసినటువంటి ఆంధ్ర సాహిత్య చరిత్ర..దీనికితోడు శ్రీ నారాయణ రెడ్డి గారి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు అనేటువంటి ఈ రెండు పుస్తకాలు.. చదివితే మనకు ఈ మూడు యూనిట్లు సంబంధించిన సిలబస్ పూర్తవుతుందన్నారు.
అదేవిధంగా జానపద సాహిత్యానికి సంబంధించి బిరుదురాజు రామరాజు గారు రాసినటువంటి పుస్తకం తెలుగు జానపద గేయ సాహిత్యం.. ఆరుర్య సుందరం రాసినటువంటి పుస్తకం కూడా మనకు లభిస్తుంది.. వాటిని మనం చదువుకోవచ్చు.. భాష రూపాలక సంబంధించి భద్రిరాజు కృష్ణమూర్తి రాసినటువంటి పుస్తకం దొరుకుతుంది. తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం అనేటువంటిది కొత్తగా చేసినటువంటి టాపిక్. దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ లో సిలబస్ దొరుకుతుంది.. సాహిత్య విమర్శకు సంబందించి ఏవీ కాలేజి వాళ్లు రాసి పుస్తకం అందుబాటులో ఉంది.
దీంట్లో కొన్ని యునిట్లు ఉన్నాయి.. ఇంకా రెడీమేడ్ కావాలనుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్లు ఎంఏ మొదటి సంవత్సరంలో 4 పేపర్లో సాహిత్య విమర్శ అని ఒక పుస్తకం ఉంది.. దాంట్లో మొదటి మూడు చాప్టర్లు చదివితే ఈ సాహిత్య విమర్శకు సంబంధించిన విషయాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో భాష అంశాల విషయంలో పదవ తరగతి వరకే ఉన్నటువంటి ఈ విషయాన్ని కనుక తీసుకుంటే అది పోటీపరీక్షలకు సరిపోదు.. దాన్ని ఇంకా అధ్యయనం చేస్తూ చందస్సులో టెన్త్ క్లాస్ వరకు నాలుగైదు వృత్తాలు మిగతా పద్యాలు ఏడెనిమిది చందస్సులు నేర్చుకుంటే సరిపోతుంది.. కానీ పరీక్షల్లో వచ్చేటివి అంతకుమించి ఉన్నాయి.
కాబట్టి దాని విషయం లో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇవన్నీ పుస్తకాలు మేము చదవలేను అనుకున్న టువంటి వారి కి ప్రైవేటుగా పోటీపరీక్షలకు పబ్లిష్ చేసేటటువంటి విజేత పబ్లికేషన్స్ కావచ్చు.. అను పబ్లికేషన్స్ కావచ్చు.. ఉద్యోగ సోపానం కావచ్చు.. కొత్త కొత్త కంపెనీలు చాలా వచ్చాయి.. వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. ఇక మెథడాలజీ కి సంబంధించి 16 మార్కులు మనకు వస్తాయి. దాంట్లో 6 యూనిట్లు ఉన్నాయి. వీటికీ బి.ఎడ్ మరియు డి.ఎడ్ బోధనా పద్ధతులు రెండు పుస్తకాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం సంపాదించాలంటే.. భాషపై పట్టు పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, School, Teacher